AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సార్‌.. అమ్మ చదువుకోమంటోంది.. తల్లిపై ఫిర్యాదు చేసిన బాలుడు వీడియో

సార్‌.. అమ్మ చదువుకోమంటోంది.. తల్లిపై ఫిర్యాదు చేసిన బాలుడు వీడియో

Samatha J
|

Updated on: Sep 18, 2025 | 4:15 PM

Share

పిల్లలు స్కూలుకి వెళ్లడానికి మారాం చేయడం కామన్‌.. కడుపు నొప్పి వస్తుందనో..కాలు నొప్పి వస్తుందనో ఏదో ఒక సాకు చెప్పి స్కూలు ఎగ్గొట్టడానికి ట్రై చేస్తారు.. అయితే ఇదంతా పాత ట్రెండ్‌.. ఇప్పుడు ట్రెండ్‌ మారింది.. తల్లిదండ్రులు పిల్లలను స్కూలుకి వెళ్లమన్నా.. చదువుకోమన్నా డైరెక్ట్‌గా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడం నయా ట్రెండ్. అవును విజయవాడలో ఓ కుర్రాడిని చదువుకోమని తల్లి మందలించడంతో ఏకంగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన నెట్టింట వైరల్‌గా మారింది.

సత్యనారాయణపురం గులాబీతోట ప్రాంతానికి చెందిన మహిళకు ఇద్దరు కుమారులు. భర్తతో విభేదాల కారణంగా ఒంటరిగా ఉంటూ పిల్లలను పెంచుకుంటూ జీవిస్తోంది. ఇద్దరు పిల్లలను చదివించే స్తోమత లేక పెద్ద కుమారుడు, తల్లి వేర్వేరు దుకాణాల్లో పనిచేస్తూ చిన్న కుమారుడిని చదివిస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద కుమారుడిని ఒక దుకాణంలో పనిలోకి పంపుతున్నారు. బాలుడు ఆరో తరగతి చదువుతున్నాడు. చిన్న కుమారుడికి సెల్‌ ఫోన్‌ కొనిచ్చింది. అదే ఆమె చేసిన పొరపాటైంది. అవసరానికి ఫోను కొనిస్తే.. చదువు మానేసి ఫోనులో మునిగిపోతున్నాడని మందలించింది. దీంతో తల్లిపై కోపంతో ఆ బాలుడు విజయవాడలోని వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాలుడి తల్లిని పిలిపించి విచారించిన ఏసీపీ దుర్గారావు పరిస్థితిని అర్థం చేసుకుని, చదువు లేకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను బాలుడికి వివరించి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. తన తల్లి, సోదరుడు ఎంతో కష్ట పడి బాలుడిని చదివిస్తున్నారని, బాలుడు చక్కగా చదువుకొని వారికి అండగా నిలవాలని హితబోధ చేశారు. దీంతో బాలుడు పరిస్థితిని అర్థం చేసుకుని తల్లితోపాటు ఇంటికి వెళ్లిపోయాడు.

మరిన్ని వీడియోల కోసం :

సెలవులొచ్చాయ్..స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం వీడియో

ఆమె అరుపు విని కాకులే మోసపోయాయిగా..వీడియో

చెదిరిన కల.. అమెరికాలో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం వీడియో

ఇందేంట్రా బాబు ఆకాశంలో రెండు చందమామలు.. మీరూ చూడండి మరి !