ఇందేంట్రా బాబు ఆకాశంలో రెండు చందమామలు.. మీరూ చూడండి మరి !
మీరు విన్నది నిజమే.. ఆకాశంలో మరో చందమామను గుర్తించారు శాస్త్రవేత్తలు. అంతేకాదు అది భూమికి దగ్గరగా ఉన్నట్టు కనుగొన్నారు. చందమామ అంటే మీరనుకున్నట్టు గుండ్రంగా, లోపల మచ్చతో ఉండే మన రెగ్యులర్ చందమామలా ఉండదు. నిజానికి అదొక గ్రహశకలం. దీనికి ‘2025 పీఎన్7’ అని పేరు పెట్టారు. ఇది సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. అయితే ఇది భూమికి దగ్గరగా ఉంది. ఈ అంతరిక్ష శిలకు కూడా సూర్యుడిని చుట్టి రావడానికి ఏడాది సమయం పడుతుంది.
ఇలాంటి గ్రహ శకలాలను క్వాసీ మూన్‌గా పిలుస్తారు. అరుదుగా భూమి చుట్టూ పరిభ్రమించే తాత్కాలిక మినీ మూన్‌లకు ఇవి భిన్నంగా ఉంటాయి. ‘2024 పీటీ5’ అనే మినీ మూన్ దీనికి మంచి ఉదాహరణ. అది నిరుడు 2 నెలలే భూమి చుట్టూ తిరిగింది. గతంలో చందమామ నుంచి విడిపోయిన ఒక తునకగా దీన్ని భావిస్తున్నారు. క్వాసీ చందమామలు అనేకం భూమికి సమీపంలో ఉన్నాయి. 2025 పీఎన్7ను ఆగస్టు నెల 29న హవాయ్‌లోని పాన్-స్టార్స్ అబ్జర్వేటరీ గుర్తించింది. ఇది భూమికి సమీప కక్ష్యలో దశాబ్దాలుగా పరిభ్రమిస్తోందని పాత డేటాను పరిశీలించినప్పుడు వెల్లడైంది. ఇది చిన్నగా, మసకమసకగా ఉండటం వల్ల ఇన్నేళ్లపాటు ఖగోళ శాస్త్రవేత్తల కంటపడి ఉండపోవచ్చని భావిస్తున్నారు. భూమికి దగ్గరగా వచ్చినప్పుడు అది మనకు 3 లక్షల కి.మీ దూరంలో ఉంటుందని పరిశోధకులు తెలిపారు. ఇది మరో 60 ఏళ్ల పాటు పుడమికి సమీపంలో ఉంటుందని తెలిపారు.
మరిన్నివీడియోల కోసం :
భయం లేదు.. అప్రమత్తంగా ఉంటే చాలు వీడియో
ఆ మరణాలు బొడ్రాయి వల్లేనా?వీడియో
నన్నే కాటు వేస్తావా.. పామును తాత ఏం చేశాడంటే? వీడియో
జపాన్‌లో లక్షకు చేరిన 100 ఏళ్లు దాటిన వృద్ధుల సంఖ్య వీడియో
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
