దంచికొట్టనున్న వానలు.. మరో నాలుగు రోజులు భారీ వర్షాలు వీడియో
తెలంగాణలో రాగల నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధవారం నుంచి శనివారం వరకూ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. గురు, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పింది.
శనివారం రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వివరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. కాగా, గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, సిద్దిపేట, జనగాం, సంగారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మెదక్ జిల్లాలో రేగోడు గ్రామంలో 7.8, కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో 6.6, జగిత్యాల జిల్లా గోధురులో 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వెల్లడించింది.
మరిన్నివీడియోల కోసం :
భయం లేదు.. అప్రమత్తంగా ఉంటే చాలు వీడియో
ఆ మరణాలు బొడ్రాయి వల్లేనా?వీడియో
నన్నే కాటు వేస్తావా.. పామును తాత ఏం చేశాడంటే? వీడియో
జపాన్‌లో లక్షకు చేరిన 100 ఏళ్లు దాటిన వృద్ధుల సంఖ్య వీడియో
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
