సెలవులొచ్చాయ్..స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం వీడియో
సెలవుల కోసం ఎదురు చూసే విద్యార్థులకు పండగలాంటి వార్త ఇది. దసరా పండగకు సంబంధించి సెలవుల షెడ్యూల్‌ను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఉండనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. మొత్తం 9 రోజుల పాటు విద్యార్థులకు దసరా సెలవులు ఇచ్చారు. అక్టోబర్ 3వ తేదీన పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి.
ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం దసరా సందర్భంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటిస్తుంది. దాంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ సెలవులను కుటుంబంతో గడిపే అవకాశం లభిస్తుంది. ఈ సందర్భంగా హాస్టల్స్ లో ఉండే విద్యార్థులు తమ సొంతూళ్లకు వెళ్తారు. పాఠశాలలు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ సెలవుల షెడ్యూల్‌ను గమనించి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు. సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన అనేకమంది సైతం పిల్లల సెలవుల నేపథ్యంలో వారి కార్యాలయాలకు సెలవులు పెట్టుకుని స్వగ్రామాలకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.ఇక తెలంగాణలో కూడా 13 రోజుల పాటు దసరా సెలవులు ఉండనున్నాయి. ఈ నెల 21 నుంచి అక్టోబరు 3 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. అధికారికంగా మొత్తం 13 రోజులు పండగ సెలవులిచ్చారు. 4న బడులు పునఃప్రారంభమవుతాయి.
మరిన్నివీడియోల కోసం :
భయం లేదు.. అప్రమత్తంగా ఉంటే చాలు వీడియో
ఆ మరణాలు బొడ్రాయి వల్లేనా?వీడియో
నన్నే కాటు వేస్తావా.. పామును తాత ఏం చేశాడంటే? వీడియో
జపాన్‌లో లక్షకు చేరిన 100 ఏళ్లు దాటిన వృద్ధుల సంఖ్య వీడియో
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి
