AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేవభూమిపై మరోసారి జలవిలయం వీడియో

దేవభూమిపై మరోసారి జలవిలయం వీడియో

Samatha J
|

Updated on: Sep 17, 2025 | 10:10 PM

Share

దేవభూమిపై మరోసారి జలవిలయం విరుచుకుపడింది. ప్రకృతి ప్రకోపానికి ఉత్తరాఖండ్‌ విలవిలలాడిపోయింది. డెహ్రాడూన్‌లో ఆకాశానికి చిల్లుపడ్డట్టు కురిన కుంభవృష్టితో తమ్సా నది మహోగ్రరూపంతో ప్రవహిస్తోంది. డెహ్రాడూన్‌లో తెల్లవారుజామున క్లౌడ్ బరస్ట్ కారణంగా వరదలు ముంచెత్తికొచ్చాయి. పలు ప్రాంతాలు నీటమునిగాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. అకస్మాత్తుగా సంభవించిన వరదల్లో కార్లు, దుకాణాలు కొట్టుకుపోయాయి. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. పలువురు గల్లంతయ్యారు.

ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గల్లంతు అయిన వ్యక్తులను కాపాడేందుకు రెస్క్య టీమ్ ప్రయత్నాలు చేస్తోంది.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల డెహ్రాడూన్‌లోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన టపకేశ్వర్ మహాదేవ్ ఆలయం జలమయమైంది. తమ్సా నది ఉప్పొంగడంతో వరద నీరు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి, ఆవరణలోని హనుమాన్ విగ్రహం వరకు చేరింది. అయితే, గర్భగుడికి మాత్రం ఎలాంటి ప్రమాదం జరగలేదు. మరోవైపు, రిషికేశ్‌లోనూ చంద్రభాగ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నదిలో చిక్కుకుపోయిన ముగ్గురు వ్యక్తులను ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా కాపాడాయి. డెహ్రాడూన్-హరిద్వార్ జాతీయ రహదారిపై ఉన్న ఒక వంతెన కూడా దెబ్బతిన్నది. పితోరాఘడ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి

మరిన్నివీడియోల కోసం :

భయం లేదు.. అప్రమత్తంగా ఉంటే చాలు వీడియో

ఆ మరణాలు బొడ్రాయి వల్లేనా?వీడియో

నన్నే కాటు వేస్తావా.. పామును తాత ఏం చేశాడంటే? వీడియో

జ‌పాన్‌లో ల‌క్షకు చేరిన 100 ఏళ్లు దాటిన వృద్ధుల సంఖ్య వీడియో