గిరిజన మహిళకు దొరికిన వజ్రాలు రాత్రికి రాత్రే లక్షాధికారిగా .. వీడియో
అంతర్జాతీయంగా వజ్రాలకు పేరొందిన మధ్యప్రదేశ్.. పన్నా మరోసారి వార్తల్లో నిలిచింది. అక్కడ ఇటీవల ఒక గిరిజన మహిళకు అత్యంత ఖరీదైన మూడు వజ్రాలు దొరికాయి. దీంతో ఆ మహిళ రాత్రికి రాత్రే లక్షాధికారిగా మారిపోయింది. ఈ మూడు వజ్రాలలో ఒకటి అత్యంత ఖరీదైనదంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
పన్నా జిల్లా రాజ్‌పూర్‌కు చెందిన వినీతా గోండ్‌కు పటీ అనే గిరిజన మహిళకు ఈ వజ్రాలు లభ్యమయ్యాయి. డైమండ్ ఆఫీస్‌కు చెందిన ఈ ప్రాంతాన్ని వినీత లీజ్‌కు తీసుకుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం దొరికిన వజ్రాలు 1.48 క్యారెట్, 20, 7 సెంట్ల బరువున్నాయని,త్వరలోనే వీటిని వేలం వేస్తామని, అప్పుడే వాటి ధర ఏంటన్నది తెలుస్తుందని పన్నా జిల్లా ప్రభుత్వ అధికారి అనుపమ్ సింగ్ మీడియాకు తెలిపారు. ఆ మూడు వజ్రాల్లో ఒకటి అధిక నాణ్యత కలిగినదని ఆయన చెప్పారు. జులై నెలలో హర్ గోవింద్ యాదవ్ అనే కూలీకి నిస్సార గనిలో ఎనిమిది వజ్రాలు దొరికాయి. అందులో కొన్నీ ముడి వజ్రాలు కాగా, మరికొన్ని శుద్ధమైనవి. ఆ వజ్రాలను పన్నాలోని వజ్రాల మ్యూజియంలో పెట్టి వాటి విలువను అంచనా వేసి, అనంతరం వేలం వేయనున్నారు. ఆ వేలంలో వచ్చిన మొత్తం నుంచి పన్నులు కట్ చేసి మిగిలిన డబ్బును గోవింద కుటుంబానికి అందజేయనున్నారు. వాటి ధర 10 నుంచి 12 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేసారు. కటియా గ్రామానికి చెందిన హరగోవింద్, అతని భార్య పవన్ దేవి యాదవ్ గత 5 ఏళ్లుగా పన్నాలోని నిస్సార గనిలో పని చేస్తున్నారు. వజ్రం కోసం తవ్వుతూనే ఉన్న ఈ దంపతులకు చివరికి అదృష్టం తలుపుతట్టింది. ఒకేసారి 8 వజ్రాలు లభించాయి.
మరిన్ని వీడియోల కోసం :
రాజీనామాను ఆమోదించాలని ఎమ్మెల్సీ కవిత ఫోన్ చేశారు వీడియో
విమానంలో టీ కోసం గొడవ చెట్టంత మగాడిని చావబాదిన మహిళ వీడియో
సీనియర్ నటి రమాప్రభ అల్లుడు .. తెలుగులో తోపు హీరో.. ఫాలోయింగ్ ఎక్కువే వీడియో
సార్.. అమ్మ చదువుకోమంటోంది.. తల్లిపై ఫిర్యాదు చేసిన బాలుడు వీడియో
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
