ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం ఏంటి..
ఏపీ బీజేపీలో కాపు సామాజికవర్గ నేతలే లేరా? బీజేపీ దగ్గర కూడా సమాధానం లేని ప్రశ్న ఇది. కాపు, తెలగ, బలిజ, ఒంటరి, మున్నూరు కాపు ఇలా.. కాపు సామాజిక వర్గంలో ఉప కులాలు ఉన్నాయి. వీరిలో ఏ ఒక్కరికీ టికెట్ కేటాయించలేదు బీజేపీ. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోమువీర్రాజును కాపు సామాజికవర్గ ఐకాన్‌గానే ఒకప్పుడు ఆ పదవిలో కూర్చోబెట్టింది అధిష్టానం.

ఏపీ బీజేపీలో కాపు సామాజికవర్గ నేతలే లేరా? బీజేపీ దగ్గర కూడా సమాధానం లేని ప్రశ్న ఇది. కాపు, తెలగ, బలిజ, ఒంటరి, మున్నూరు కాపు ఇలా.. కాపు సామాజిక వర్గంలో ఉప కులాలు ఉన్నాయి. వీరిలో ఏ ఒక్కరికీ టికెట్ కేటాయించలేదు బీజేపీ. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోమువీర్రాజును కాపు సామాజికవర్గ ఐకాన్‌గానే ఒకప్పుడు ఆ పదవిలో కూర్చోబెట్టింది అధిష్టానం. చివరికి సోమువీర్రాజుకు కూడా టికెట్ లేకుండా చేశారంటూ మండిపడుతోంది కాపు సమాజం. టీడీపీ, జనసేనతో పొత్తులో వెళ్తున్న బీజేపీకి 6 ఎంపీ స్థానాలు, 10 ఎమ్మెల్యే సీట్లు కేటాయించారు. కాని, ఈ 16 స్థానాల్లో ఒక్క సీటు కూడా కాపు సామాజిక వర్గ నేతకు ఇవ్వలేదు. అందుకే, బీజేపీపై కారాలు మిరియాలు నూరుతోంది కాపు ఐక్య వేదిక. కాపు కమ్యూనిటీని ఏపీ బీజేపీ పూర్తిగా పక్కనపెట్టిందని కాపు ఐక్యవేదిక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో బలమైన కమ్యూనిటీ అయిన తమను విస్మరించడం ఏంటని మండిపడుతోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పడమే లక్ష్యంగా పనిచేస్తామని కూడా హెచ్చరించింది. అంతటితో ఆగకుండా ఈ ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధిచెప్పాల్సిందేనంటూ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కాపు ఉప కులాలకు పిలుపునిచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కలిసి.. కావాలనే కాపులకు అన్యాయం చేశారంటూ కాపు ఐక్య వేదిక ఆరోపిస్తోంది. దీనిపై ప్రధాన మంత్రి మోదీ, హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు మెయిల్ ద్వారా కంప్లైంట్ ఇచ్చినట్టు ప్రకటించారు.
అసలు కాపు సామాజికవర్గానికి చెందిన ఒక్క నేతకు కూడా టికెట్ ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటి? పొత్తులో భాగంగా పవన్ కల్యాణ్ ఉండగా.. ఇక కాపు సామాజికవర్గం నాయకులకు టికెట్లు ఎందుకు అని అనుకున్నారా? ప్రస్తుతం ఏపీలో కాపు సామాజికవర్గంలో బలమైన నేతగా కనిపిస్తున్నది పవన్ ఒక్కరే. కాపు కమ్యూనిటీకి ఫేస్ ఆఫ్ ది లీడర్‌గా ఉన్నారు. పైగా జనసేనతో మొదటి నుంచి పొత్తులోనే ఉంది బీజేపీ. పవన్ కల్యాణ్ ఇకపైనా తమతోనే ఉంటారన్న నమ్మకంతోనే కాపు సామాజిక వర్గానికి తప్ప మిగతా వారికి బీజేపీ టికెట్లు ఇచ్చిందా? రీసెంట్‌గా ముద్రగడను కూడా బీజేపీలోకి చేర్చుకుందామనుకున్నారు. బీజేపీ అధిష్టానం నుంచి, ఆర్ఎస్‌ఎస్ పెద్దల నుంచి ముద్రగడకు పిలుపులు కూడా వెళ్లాయి. ఈ విషయం ఆయనే చెప్పుకున్నారు కూడా. కారణాలేవైనా బీజేపీలో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. కాపు కమ్యూనిటీ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నామని బహిరంగంగానే చెబుతున్నారు కమలం నేతలు. ఇంత పెద్ద కమ్యూనిటీలో, ఇంత పెద్ద పార్టీలో టికెట్ ఇవ్వడానికి ఒక్క కాపు సామాజికవర్గ నేత కూడా కనిపించలేదా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు కాపు సామాజికవర్గం ఐక్యతే లక్ష్యంగా సోమువీర్రాజును ఏపీ బీజేపీ అధ్యక్షుడిని చేశారు. ఈ ఫ్యాక్టర్‌తో బలపడాలని కూడా భావించింది బీజేపీ. అప్పట్లో సోమువీర్రాజు కూడా అగ్రెసివ్‌గా వెళ్లారు. ఏపీ బీజేపీ బాధ్యతలు చేపట్టడంతోనే వెళ్లి చిరంజీవిని కలిసొచ్చారు. బీజేపీ కేంద్ర అధిష్టానం కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణకు ప్రధాని మోదీ వచ్చినప్పుడు.. చిరంజీవిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. భీమవరంలో జరిగిన ఆ కార్యక్రమంలో ప్రధాని మోదీతో కలిసి వేదిక పంచుకున్నారు చిరంజీవి. ఒకప్పుడు కాపునాడు సభలో పాల్గొన్న జీవీఎల్ నరసింహారావు తాను కులానికి పెదకాపు అవుతానంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అంతేకాదు, గన్నవరం ఎయిర్‌పోర్టుకు వంగవీటి రాధా పేరు పెట్టాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే కాపు నేతనే సీఎం అని కూడా ఒకసారి స్టేట్‌మెంట్ ఇచ్చారు. కాపు నేతలకు బీజేపీ ఎంత ప్రాధాన్యత ఇచ్చిందంటే.. కాపు నేతగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణకు ఏపీ బీజేపీ బాధ్యతలు అప్పగించారు. కన్నా తరువాత ఆ ప్లేస్‌లోకి వచ్చింది సోమువీర్రాజు. సో, ఏపీలో కాపు కమ్యూనిటీపై బీజేపీ బలమైన ఫోకస్ పెట్టిందనేది నిజం. ఆంధ్రప్రదేశ్ జనాభాలో కాపు సామాజికవర్గం 20 శాతం వరకు ఉంటుందని అప్పట్లో లెక్కలేసింది కమలదళం. ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కాపు కమ్యూనిటీకి బలం ఎక్కువ. సుమారు 39 అసెంబ్లీ నియోజకవర్గాలపై కాపు సామాజికవర్గం ప్రభావం చూపగలదని బీజేపీ నమ్మింది కూడా. ఆ బలమైన కమ్యూనిటీని తన వైపు తిప్పుకునేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలే చేసింది.
ఏపీ జనాభాలో రెడ్డి సామాజికవర్గం 5 శాతం. కమ్మ సామాజికవర్గం జనాభా 10 శాతం. ముఖ్యమంత్రులు అయింది కూడా ఈ రెండు సామాజికవర్గాల వారే. సో, కాపు ఫ్యాక్టర్‌ను ఉపయోగించుకుంటే రాష్ట్రంలో బలపడొచ్చని ఇలాంటి లెక్కలన్నీ వేసి.. కాపులకు ప్రాధాన్యత ఇచ్చింది. 2009లో చిరంజీవి దక్కించుకున్న 18 శాతం ఓట్లలో మెజారిటీ వాటా కాపులదే అనేది బీజేపీ నమ్మకం. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచినా.. అప్పట్లో వైసీపీ-టీడీపీకి మధ్య ఓటు షేర్ తేడా జస్ట్ 2.06 శాతమే. సో, టీడీపీ గెలవడానికి కారణం.. పవన్ కల్యాణ్ అండ్ కాపు ఓటు బ్యాంకేననేది బీజేపీ వాదన. అంతేకాదు, 2019లో వైసీపీ గెలవడానికి సైతం టీడీపీపై కాపులలో ఉన్న ఆగ్రహమేనని బీజేపీలోకి ఓ వర్గం అంచనా వేసింది. ఈసారి కాపు ఓటు చీలిపోకూడదన్న ఉద్దేశంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు.. వన్‌సైడ్ లవ్‌ను టూసైడ్‌గా మార్చుకోగలిగారని బీజేపీ నేతలు చెబుతుంటారు. జనసేనతో టీడీపీ పొత్తుకు కారణాల్లో కాపు ఫ్యాక్టర్ కూడా ఒకటి. ఏపీలో కాపు కమ్యూనిటీ బలం తెలుసు కాబట్టే.. మొదటి నుంచి కాపు ఫ్యాక్టర్‌పై బీజేపీ ఫోకస్ పెంచింది. అంటే.. ఆపరేషన్ కాపును ముందు నుంచి చేపట్టాలనుకుంది బీజేపీ. కారణాలు ఏవైనా గానీ.. ఆ ఆపరేషన్‌ను సజావుగా చేయలేకపోయింది. తిరిగి కమ్మ సామాజికవర్గానికి చెందిన పురంధేశ్వరికి పగ్గాలు అప్పగించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




