Andhra Pradesh BJP: మేం రెడీ.. చిరంజీవి మద్ధతుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత సోమువీర్రాజు..

Andhra Pradesh BJP: కేంద్ర మాజీ మంత్రి, సినీనటుడు చిరంజీవి ఆంధ్రప్రదేశ్‌లో జనసేనకు, బీజేపీకి మద్ధతివ్వనున్నారా? తన తమ్ముడు..

Andhra Pradesh BJP: మేం రెడీ.. చిరంజీవి మద్ధతుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత సోమువీర్రాజు..
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 28, 2021 | 4:21 PM

Andhra Pradesh BJP: కేంద్ర మాజీ మంత్రి, సినీనటుడు చిరంజీవి ఆంధ్రప్రదేశ్‌లో జనసేనకు, బీజేపీకి మద్ధతివ్వనున్నారా? తన తమ్ముడు పవన్‌కు రాజకీయంగా అండగా నిలబడనున్నారా? తిరుపతి ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమికి మద్ధతుగా నిలుస్తారా? ఏపీలో రాజకీయ పరిస్థితులను గమనిస్తే ఔననే అనిపిస్తోంది. తాజాగా ఇదే అంశంపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన.. జనసేన, బీజేపీలకు మద్దతు ఇస్తానని చిరంజీవి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఆయనతో కలిసి పని చేసేందుకు తాము సిద్ధమని సోమువీర్రాజు ప్రకటించారు. ఇదే సమయంలో బీజేపీకి టీడీపీ, వైసీపీ పార్టీలు మద్ధతు ఇవ్వడంపైనా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయం అని సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు. అయితే, టీడీపీ, వైసీపీలలో ఏ పార్టీ బీజేపీకి మద్ధతు ఇస్తారో చూస్తామని వ్యాఖ్యానించారు.

ఇదిలాఉంటే.. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం కాండ్రపాడ గ్రామంలో బీజేపీ కార్యాలయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రారంభించారు. బీజేపీ కార్యాలయానికి ఓ వ్యక్తి స్థలం ఇచ్చాడని తెలుసుకున్న ప్రభుత్వం.. అతని పెన్షన్‌ను తీసివేసిందని, ఇది దారుణమైన చర్య అని వీర్రాజు ఫైర్ అయ్యారు. ప్రభుత్వం బెదిరింపు ధోరణిని అవలంభిస్తోందన్నారు. కాగా, పార్టీ కార్యాలయం సందర్భంగా కాండ్రపాడు గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన 50 మంది కార్యాకర్తలు బీజేపీలో చేరారు.

Also read:

Protest Against Protest: ఢిల్లీలో మళ్లీ టెన్షన్‌.. రైతులు సింఘు బోర్డర్‌ను వీడాలంటూ స్థానికుల ఆందోళన

ప్రజల్ని హింసకు రెచ్చగొట్టే టీవీ కార్యక్రమాలకు కళ్ళెం , కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన