Andhra Politics: ఏపీ కురుక్షేత్రం.. వైసీపీలో మార్పులు దేనికి సంకేతం? విపక్షాల రియాక్షన్ ఏంటి?
Big News Big Debate: తెలంగాణలో ముగిసింది.. ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. మరికొన్ని రోజుల్లో ఏపీ అసెంబ్లీకి ఎలక్షన్స్ జరగనుండటంతో... అక్కడి అధికార పార్టీ సిట్టింగ్ స్థానాల్లో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టింది. ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్ వచ్చేయడంతో... ఇప్పుడు సెకండ్ లిస్టుమీద హైటెన్షన్ ఏర్పడింది.అసలు ఈ మార్పు దేనికి సంకేతం? ఇప్పుడిదే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Big News Big Debate: తెలంగాణలో ముగిసింది.. ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. మరికొన్ని రోజుల్లో ఏపీ అసెంబ్లీకి ఎలక్షన్స్ జరగనుండటంతో… అక్కడి అధికార పార్టీ సిట్టింగ్ స్థానాల్లో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టింది. ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్ వచ్చేయడంతో… ఇప్పుడు సెకండ్ లిస్టుమీద హైటెన్షన్ ఏర్పడింది.అసలు ఈ మార్పు దేనికి సంకేతం? ఇప్పుడిదే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయదుందుభి మోగించిన వైసీపీ.. ఈసారి వైనాట్ 175 అంటోంది. ఆ దిశగా కసరత్తులు చేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్…చాలా చోట్ల సిట్టింగులకు నో టిక్కెట్ అంటూ.. కరాఖండీగా చెప్పేస్తున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలకు టిక్కెట్ ఇచ్చేది లేదని ఫస్ట్ లిస్టులో తేల్చేసిన వైసీపీ హైకమాండ్.. 11చోట్ల ఇంచార్జ్‌లను కూడా మార్చేసి అక్కడా మార్పు కన్ఫామ్ అనే సంకేతాలిచ్చింది. ఇప్పటికే భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడిన సీఎం జగన్… సెకండ్ లిస్ట్ పై వర్క్‌చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఉభయగోదావరి జిల్లాల్లో .. 34 స్థానాలకు గాను 2019లో 28స్థానాలు గెలిచింది వైసీపీ. ఈసారి కూడా ఈ రెండు జిల్లాల్ని కీలకంగా భావిస్తున్న జగన్.. ఆరుగురు సిట్టింగులకు నో టిక్కెట్ అని చెప్పేశారు. పోలవరం,చింతలపూడి, గన్నవరం, ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, రామచంద్రాపురం స్థానాల్లో సిట్టింగుల ప్లేసులో కొత్తవారికి ఛాన్సిస్తోంది.
రాయలసీమలో పెనుగొండ,కళ్యాణదుర్గం, కర్నూల్, కడప, మైదుకూరు, రైల్వే కోడూరు స్థానాల్లోనూ సిట్టింగుల మార్పు ఖాయమైపోయింది. అటు, ఎన్టీఆర్ జిల్లా పెడన నుంచి జోగి రమేష్‌కు, విజయవాడ పశ్చిమలో వెల్లంపల్లి శ్రీనివాస్‌కు స్థానచలనం జరగనుంది. ఈ మార్పు లిస్టులో పలువురు మంత్రులు కూడా ఉండటం విశేషం. అయితే, జగన్ ఎక్కడంటే అక్కడ? టిక్కెట్ ఇవ్వకున్నా ఓకే? అంటున్నారు వైసీపీ నేతలు.
బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లైవ్ వీడియో చూడండి..
మొత్తానికి వైసీపీ సెకండ్ లిస్ట్ ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది. మంగళవారం మరికొందరితో సీఎం భేటీ తర్వాత రెండో జాబితా ఉంటుందనే చర్చ జరుగుతోంది. మొత్తంగా 40 నుంచి 50 స్థానాల్లో మార్పు తథ్యమన్న మాట వినిపిస్తోంది. కాకపోతే, విడుదల మాత్రం పండగ తర్వాతే అంటున్నాయి వైసీపీ వర్గాలు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
