AP News: భోగాపురం ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్‌లైన్ ఫిక్స్.. ఏపీవాసులకు కేంద్రం గుడ్‌న్యూస్..
సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్, ఏపీ సీఎం చంద్రబాబు భేటి అయ్యారు. రాష్ట్రంలో కొత్త ఎయిర్‌పోర్టులు, సీ ప్లేన్స్ పాలసీపై చర్చించారు. 2026 జూన్ నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తి చేస్తామన్నారు మంత్రి రామ్మోహన్‌నాయుడు.

సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్, ఏపీ సీఎం చంద్రబాబు భేటి అయ్యారు. రాష్ట్రంలో కొత్త ఎయిర్‌పోర్టులు, సీ ప్లేన్స్ పాలసీపై చర్చించారు. 2026 జూన్ నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తి చేస్తామన్నారు మంత్రి రామ్మోహన్‌నాయుడు. అటు ఏపీలో మిగతా ఎయిర్‌పోర్టుల విస్తరణ కూడా వచ్చే ఏడాదిలోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఈస్ట్ కోస్ట్‌లో లాజిస్టిక్ హబ్‌గా మారబోతుందని.. వాటికి అనుసంధానంగానే కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణం జరుగుతుందన్నారు మంత్రి. 30 ఏళ్ల తర్వాత అవసరాల దృష్టిలో పెట్టుకుని కొత్త పోర్టులకు శ్రీకారం చుట్టామన్నారు. రిమోట్ ప్రాంతాల్లో కూడా 80, 20 సీటర్స్ విమానాలు తిప్పేలా ఎయిర్ పోర్టులకు రూపకల్పన చేయాలని చంద్రబాబు సూచనలకు అనుగుణంగా అధ్యయనం చేయనున్నట్టు తెలిపారు.
ఏపీలో సీ ప్లేన్స్ ప్రాజెక్టు మళ్లీ రెక్కలు తొడుగుతోంది. వారంరోజుల్లో కేంద్రం సీ ప్లేన్ పాలసీ తీసుకొస్తుందని ఇందులో భాగంగా ఏపీలో ఉన్న అవకాశాలపై ప్రత్యేకంగా దృష్టిపెడతామన్నారు మంత్రి రామ్మోహన్‌నాయుడు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో శ్రీశైలం, ప్రకాశం బ్యారేజీలో సీ ప్లేన్స్ వచ్చేలా ప్రణాళిక ఉంటుందన్నారు. అటు టూరిజం, మెడికల్ రంగాల్లో హెలికాప్టర్ సర్వీసులపైనా ప్రత్యేకంగా దృష్టిపెడతామన్నారు సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్‌నాయుడు. డ్రోన్స్ విషయంలోనూ ఏపీ ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొస్తుందని.. ఇందులో ఏపీకి ప్రాధాన్యత ఇచ్చేలా చూస్తామన్నారు మంత్రి.