AP News: ‘ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు’.. పోలవరం డయాఫ్రమ్ వాల్‌పై మంత్రి క్లారిటీ..
పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ పై నిపుణుల కమిటీ రిపోర్ట్ రాకముందే రాష్ట్ర ప్రభుత్వం పై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మండి పడ్డారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. 2020 ఆగస్ట్‌లో వచ్చిన..
పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్‌పై నిపుణుల కమిటీ రిపోర్ట్ రాకముందే రాష్ట్ర ప్రభుత్వం పై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. 2020 ఆగస్ట్‌లో వచ్చిన వరదలకు పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిందని నీతిఆయోగ్ రిపోర్ట్ ఇచ్చిందని. ఇది ప్రకృతి తప్పిదం కాదు.. ప్రభుత్వ తప్పిదమని ఐఐటీ హైదరాబాద్ నిపుణులు రిపోర్ట్ ఇచ్చింది వాస్తవమో కాదో జగన్, వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోవలరం ప్రాజెక్టుకు కేంద్రం రీయంబర్స్ చేసిన 4 వేల కోట్ల రూపాయల నిధులను జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపణలు చేశారు. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిధులను సైతం మళ్లించి రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన వైసీపీ నాయకులకు పోవరం ప్రాజెక్టుపై మాట్లాడే హక్కు లేదని ఆయన అన్నారు.
ఎండలు ముదురుతున్నాయ్.. బీ అలర్ట్
కోనసీమలో మళ్లీ నాటి పెళ్లి.. ఎడ్లబండిపై తరలివచ్చిన పెళ్లికూతురు
అనంతపురంలో సిమ్లా యాపిల్స్ సాగు.. ఇదిగో ఇలా..
ఏజెన్సీలోకి మళ్లీ 'పెద్దపులి'.. పగలంతా రెస్ట్, రాత్రిపూట వేట
మహానగరంలో మ్యాట్రిమోనీ మాయగాడు
త్వరలో నన్ను కూడా చంపేస్తారేమో!
నేను మద్యం సేవించి పోలీస్టేషన్‌కు రాలేదు!

