R Krishnaiah: ఎంపీ పదవికి ఆర్ కృష్ణయ్య రాజీనామా.. అందుకే చేశానంటూ సంచలన ప్రకటన..
రాజ్యసభ సభ్యుడు, బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్య వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చారు. రాజ్యసభ సభ్యత్వానికి ఆర్.కృష్ణయ్య రాజీనామా చేశారు. ఆర్.కృష్ణయ్య రాజీనామాని ఆమోదించిన రాజ్యసభ ఛైర్మన్.. ఆ స్థానం ఖాళీ అయినట్లు మంగళవారం ప్రకటించారు. ఏపీ నుంచి ఒక సీటు ఖాళీ అయినట్టు బులెటిన్ విడుదల చేశారు.
రాజ్యసభ సభ్యుడు, బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్య వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చారు. రాజ్యసభ సభ్యత్వానికి ఆర్.కృష్ణయ్య రాజీనామా చేశారు. ఆర్.కృష్ణయ్య రాజీనామాని ఆమోదించిన రాజ్యసభ ఛైర్మన్.. ఆ స్థానం ఖాళీ అయినట్లు మంగళవారం ప్రకటించారు. ఏపీ నుంచి ఒక సీటు ఖాళీ అయినట్టు బులెటిన్ విడుదల చేశారు. దశాబ్దాలుగా బీసీలకు పెద్దదిక్కుగా, తెలుగు రాష్ట్రాల్లో ఆ సామాజికవర్గానికి నాయకత్వం వహిస్తున్నారు కృష్ణయ్య. గతంలో ఎల్బీనగర్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్.కృష్ణయ్య తర్వాత బీఆర్‌ఎస్‌కి మద్దతిచ్చారు.
2022లో వైసీపీ కృష్ణయ్యను అనూహ్యంగా రాజ్యసభకు పంపింది. ఆర్.కృష్ణయ్య కొత్త పార్టీ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఆయన బీజేపీ వైపు చూస్తున్నారన్న చర్చ కూడా నడుస్తోంది. ప్రచారాలకు బలం చేకూర్చేలా నాలుగేళ్ల పదవీకాలం మిగిలి ఉండగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆర్.కృష్ణయ్య.. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు ప్రకటించారు. బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకే రాజీనామా చేసినట్లు టీవీ9కి చెప్పారు బీసీ నేత ఆర్.కృష్ణయ్య..
తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు పెంచుతామన్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుందని పేర్కొన్నారు. ఇప్పుడు ఉద్యమం పతాకస్థాయికి చేరింది..బీసీ రిజర్వేషన్లకు మద్దతిచ్చే పార్టీతో కలుస్తామంటూ ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. 100 బీసీ కుల సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకున్నానని.. బీసీ ఉద్యమాన్ని బలోపేతంచేసేందుకే రాజీనామా చేసినట్లు కృష్ణయ్య తెలిపారు.
లైవ్ వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..