Andhra Pradesh: పొలం బాట పట్టిన కలెక్టర్ దంపతులు.. కూలీలతో కలిసి తమ పిల్లలతో సహా వరి నాట్లు వేసిన భార్యాభర్తలు
కొంతమంది రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు కూడా తమకు ఏ మాత్రం ఖాళీ దొరికినా పంట పొలాల్లో దిగి స్వయంగా పంటలను పండిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కలెక్టర్ దంపతులు పొలం బాట పట్టారు. అవును వాళ్లిద్దరూ ఐఏఎస్ అధికారులు.
Andhra Pradesh: జై జవాన్, జై కిసాన్ అన్నది మన నినాదం.. ఒకరు దేశాన్ని రక్షిస్తుంటే.. మరొకరు వ్యవసాయం చేస్తూ.. పంటలు పండించి పదిమందికి అన్నం పెడుతున్నారు. అయితే వ్యవసాయం దండగ కాదు.. పండగ అనేలా నేటి యువత సరికొత్త దిశగా పంటలను పండిస్తున్నారు. లాభాల బాట పడుతున్నారు. ఇక కొంతమంది రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు కూడా తమకు ఏ మాత్రం ఖాళీ దొరికినా పంట పొలాల్లో దిగి స్వయంగా పంటలను పండిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కలెక్టర్ దంపతులు పొలం బాట పట్టారు. అవును వాళ్లిద్దరూ ఐఏఎస్ అధికారులు. భార్యా, భర్తలు.. అంతేకాదు ఇద్దరూ రెండు జిల్లాల కలెక్టర్లుగా ఉన్నారు.
అయితే, ఎప్పుడు ప్రజా క్షేత్రంలో బిజీ బిజీగా గడిపే వారు చేస్తున్న పనులను పక్కన పెట్టారు. సెలవు రోజు మాగాణి మట్టిలోకి దిగారు. వారిద్దరే కాదు వారి పిల్లలను తీసుకొని పొలంలోకి అడుగు పెట్టారు. సాధారణ కూలీల్లా వరినాట్లు వేశారు. ఎవరి గురించి అనుకుంటున్నారా.. వివరాల్లోకి వెళ్తే..
ఎర్ర చొక్కా తెల్ల లుంగీ మెరిసిపోతున్న ఇతని పేరు దినేష్ కుమార్.. పక్కనే పంజాబీ డ్రెస్‌లో ఉన్నామె ఆయన భార్య.. విజయ కృష్ణన్.. బాపట్ల జిల్లా కలెక్టర్. వీరిద్దరూ ఉండేది బాపట్లలోనే.. బాపట్ల జిల్లాలో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే బాపట్ల మండలం మురుకొండపాడులో జరుగుతున్న వరి నాట్లలో కుటుంబంతో సహా పాల్గొన్నారు. సాధారణ కూలీలతో కలిసి నాట్లు వేశారు.
అంతే కాదు పొలం గట్టుపై కూర్చోని అన్నం తిన్నారు. పెద్ద వాళ్లు బిజీగా ఉండగా వారి పిల్లలు మాత్రం పొలంలోనే సరదాగా ఆటలు మొదలు పెట్టారు. ఎంత ఎదిగినా భూమి పుత్రులమే అన్న విషయాన్ని కలెక్టర్లు చాటి చెప్పారు. లక్షల జీతం వచ్చే సాప్ట్‌వేర్ ఉద్యోగాలను విడిచి పొలం బాట పడుతున్న పలువురు టెకీలకు వీరిద్దరూ ఆదర్శంగా నిలిచారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..