Andhra: పిల్లులు ఎంత పనిచేశాయమ్మా.. పంచాయతీలో అలా పొడిచేశాడేంటి.. నవ్వొద్దు సీరియస్ మ్యాటర్..
పిల్లికి చెలగాటం - ఎలుకకు ప్రాణ సంకటం అన్న చందంగా.. రెండు పిల్లులు తెచ్చిన తంటా ఒకరికి నిజంగానే ప్రాణం మీదకి తెచ్చింది.. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్లజిల్లా మార్టూరులో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పిల్లుల పంచాయితీలో ఓ వ్యక్తి.. మరో వ్యక్తిని పొడిచాడు..

పిల్లికి చెలగాటం – ఎలుకకు ప్రాణ సంకటం అన్న చందంగా.. రెండు పిల్లులు తెచ్చిన తంటా ఒకరికి నిజంగానే ప్రాణం మీదకి తెచ్చింది.. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్లజిల్లా మార్టూరులో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బాపట్ల జిల్లా మార్టూరులోని గొట్టిపాటి హనుమంతరావు కాలనీలో నివాసం ఉండే షేక్ బాజీ (25) అదే కాలనీలో నివాసముండే బాజీ (50) అనే వ్యక్తికి కొద్దిరోజుల క్రితం రెండు పిల్లి పిల్లలను పెంచుకునేందుకు ఇచ్చాడు.. అంతవరకు బాగానే ఉంది. ఆ తరువాత తాను ఇచ్చిన రెండు పిల్లి పిల్లలకు సంబంధించి డబ్బు ఇవ్వమని షేక్ బాజీ.. పిల్లులను తీసుకున్న వ్యక్తిని అడిగాడు. ఇక్కడే అసలు కథ మొదలైంది.. ఇద్దరి మధ్య వాదన జరిగింది. ఇది కాస్త చినికి చినికి గాలి వానలా మారి ఘర్షణకు దారి తీసింది. ఫలితంగా ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగింది.
ఈ క్రమంలో పిల్లులను తీసుకున్న ఎస్కే బాజీ కత్తితో.. షేక్ బాజీ ఇంటికి వెళ్లి బెదిరించాడు. ఈ ఘర్షణలో బాజీని పొట్టలో కత్తితో పొడిచాడు ఎస్కే బాజీ.. దీంతో అతనికి తీవ్ర గాయమైంది.. తీవ్ర రక్త స్రావంతో గాయపడిన షేక్ బాజీని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదిలాఉంటే.. కత్తితో దాడి చేసిన బాజీ స్వయంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి షేక్ బాజీ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో మార్టూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
