Balineni Srinivasa: వైసీపీకి ఊహించని షాక్.. బాలినేని ఇలా నిర్ణయం తీసుకున్నారేంటి..?

మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌కు మరో భారీ షాక్‌ తగలబోతోంది. జగన్‌ దగ్గరి బంధువు, మాజీ మంత్రి, ఒంగోలు వైసీపీ రాజకీయాలను శాసించిన బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీని వీడుతున్నట్టు ఆయన అనుచరులకు స్వయంగా చెప్పినట్టు తెలుస్తోంది. గత కొంత కాలంగా ఆయన పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

Balineni Srinivasa: వైసీపీకి ఊహించని షాక్.. బాలినేని ఇలా నిర్ణయం తీసుకున్నారేంటి..?
Balineni Srinivasa Reddy
Follow us

|

Updated on: Sep 12, 2024 | 11:55 AM

వైసీపీకి మరో భారీ షాక్ తగలబోతున్నట్లు సమాచారం. సీనియర్ నేత, మాజీ మంత్రి.. జగన్‌కి ఆప్తుడిగా చెప్పే బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. ఆ పార్టీకి గుడ్ చెప్పబోతున్నట్లు సమాచారం. ఈ సమాచారంతో తాజాగా పార్టీ అధినేత జగన్.. బాలినేనిని పిలిపించుకుని మాట్లాడారు. చర్చలు అసంపూర్తిగా ముగిసినట్లు తెలిసింది. వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో బాలినేని ఉన్నట్టు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. నేడో, రేపో పార్టీకి బాలినేని రాజీనామా చేసే అవకాశం ఉందంటున్నారు. జగన్‌కు బాలినేని శ్రీనివాస్ బంధువు కూడా. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డికి స్వయంగా బావ కూడా అవుతారు.

2012లో కాంగ్రెస్‌‌ ప్రభుత్వంలో మంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేసి జగన్‌కు మద్దతుగా వైసీపీలో చేరారు బాలినేని. ఆ తర్వాత ఒంగోలు నుంచి ఉప ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై పోటీ చేసి గెలిచారు.  2019 లో వైసీపీ ప్రభుత్వంలో తొలి రెండున్నర ఏళ్లు మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మంత్రి పదవి తొలగించడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. జగన్ బుజ్జగింపుతో మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యారు. తాజాగా ఆయన రాజీనామా అంశం తెరపైకి వచ్చింది. మరో వైపు బాలినేని వ్యతిరేకులు మాత్రం ఇదంతా పార్టీపై ఒత్తిడి పెంచేందుకు చేస్తున్న డ్రామా అని కొట్టిపారేస్తున్నారు.

బాలినేని రాజీనామా ఎప్పుడు చేస్తారన్నది పక్కనపెడితే ఆయన ఏ పార్టీలో చేరతారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో బాలినేనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదే సమయంలో ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్లతో బాలినేనికి తీవ్ర విభేదాలున్నాయి. ఈ క్రమంలో బాలినేని పార్టీని వీడితే కచ్చితంగా జనసేనలో చేరుతారనే మాటలు ఒంగోలులో గట్టిగా వినిపిస్తున్నాయి.

హిట్టా.? ఫట్టా.? సుహాస్ కొత్త ప్రయోగం.. బాక్స్ ఆఫీస్ వద్ద టాక్.?
హిట్టా.? ఫట్టా.? సుహాస్ కొత్త ప్రయోగం.. బాక్స్ ఆఫీస్ వద్ద టాక్.?
హిట్టా.? ఫట్టా.? రజినీ అమితాబ్ ప్రయత్నం సక్సెస్ అయ్యిందా.?
హిట్టా.? ఫట్టా.? రజినీ అమితాబ్ ప్రయత్నం సక్సెస్ అయ్యిందా.?
ఐదేళ్ల వయస్సు నుంచి రహస్యంగా ఆ పని చేస్తున్న యువతి.! వీడియో..
ఐదేళ్ల వయస్సు నుంచి రహస్యంగా ఆ పని చేస్తున్న యువతి.! వీడియో..
మహిళల్లో ఈ సమస్యలు కనిపిస్తే జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి.!
మహిళల్లో ఈ సమస్యలు కనిపిస్తే జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి.!
మహిళలకు గుడ్ న్యూస్.! యూపీ సర్కార్ నుండి ఏపీ సర్కార్ వరకు ఫ్రీ..
మహిళలకు గుడ్ న్యూస్.! యూపీ సర్కార్ నుండి ఏపీ సర్కార్ వరకు ఫ్రీ..
ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌.. 20వేల మంది పైనే నివాసం.!
ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌.. 20వేల మంది పైనే నివాసం.!
ప్రకాశ్‌రాజ్‌పై నిర్మాత అసహనం.! రూ.కోటి నష్టంపై జస్ట్‌ ఆస్కింగ్..
ప్రకాశ్‌రాజ్‌పై నిర్మాత అసహనం.! రూ.కోటి నష్టంపై జస్ట్‌ ఆస్కింగ్..
ఒక్క లాటరీ టిక్కెట్‌తో రూ.25 కోట్లు.. ఇది కదా అదృష్టమంటే..!
ఒక్క లాటరీ టిక్కెట్‌తో రూ.25 కోట్లు.. ఇది కదా అదృష్టమంటే..!
అమ్మబాబోయ్.! ఈ విషపు ఈగలు కాలనాగు కంటే యమ డేంజర్..
అమ్మబాబోయ్.! ఈ విషపు ఈగలు కాలనాగు కంటే యమ డేంజర్..
రతన్‌ టాటాది లవ్‌ ఫెయిల్ ఆమెతోనేనా.? అందుకే పెళ్లి చేసుకోలేదా.?
రతన్‌ టాటాది లవ్‌ ఫెయిల్ ఆమెతోనేనా.? అందుకే పెళ్లి చేసుకోలేదా.?