Illegal Liquor: చెక్ పోస్ట్ తనిఖీల్లో షాకింగ్ నిజాలు.. మద్యం అక్రమ రవాణా చేస్తూ అడ్డంగా దొరికిన..
న్యూఇయర్ కిక్కులో సామాన్యులేకాదు, పోలీసులు కూడా దొరికిపోతున్నారు. పల్నాడు జిల్లాలో ఇదే జరిగింది. తెలంగాణ మద్యం ఆంధ్రాలో పట్టుబడటం రొటీన్‌గా మారింది. అయితే ఈ మద్యం తరలిస్తున్నవారిలో ఇద్దరు పోలీసులు ఉండటమే అసలు సంగతి. పొందుగుల చెక్‌పోస్టు దగ్గర పోలీసుల తనిఖీల్లో ఈ బాగోతం బయటపడింది. మద్యం తరలిస్తున్నవారిలో ఏఎస్సై కొండలు, రైటర్ స్టాలిన్ ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ ఇద్దరు పోలీసులు పరార్ అయ్యారన్నది కొసమెరుపు.

పొందుగుల చెక్‌పోస్ట్ తనిఖీల్లో తెలంగాణ మద్యం పట్టివేశారు. ఈ తనిఖీల్లో 36 ఫుల్ బాటిల్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. మద్యం తరలిస్తున్న కారును సీజ్ చేశారు. అంతేగాదు, ఇద్దరు అరెస్ట్ అయ్యారు. ఈ ఇద్దరు కాకుండా అదే కారులో- ఇద్దరు పోలీసులు ఉన్నారు. ఇలా పోలీసులే మద్యం అక్రమంగా తీసుకురావడం కలకలం రేపుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..