APSRTC: నష్టాల ఊబి నుంచి బయటపడేందుకు ఆర్టీసీ సన్నాహాలు.. గ్యారేజీలు, డిపోల్లో ఆ సేవలు

నష్టాల్లో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ(APSRTC) ని గాడిన పెట్టేందుకు సంస్థ సన్నాహాలు ముమ్మరం చేసింది. ఆర్టీసీ గ్యారేజీలు, డిపోలను ప్రైవేట్‌ వాహనాల సర్వీసింగ్‌ సెంటర్లుగా మార్చాలని నిర్ణయించింది. ఆర్టీసీకి ప్రస్తుతం రాష్ట్రంలోని విలువైన...

APSRTC: నష్టాల ఊబి నుంచి బయటపడేందుకు ఆర్టీసీ సన్నాహాలు.. గ్యారేజీలు, డిపోల్లో ఆ సేవలు
Apsrtc
Follow us

|

Updated on: Mar 27, 2022 | 9:55 AM

నష్టాల్లో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ(APSRTC) ని గాడిన పెట్టేందుకు సంస్థ సన్నాహాలు ముమ్మరం చేసింది. ఆర్టీసీ గ్యారేజీలు, డిపోలను ప్రైవేట్‌ వాహనాల సర్వీసింగ్‌ సెంటర్లుగా మార్చాలని నిర్ణయించింది. ఆర్టీసీకి ప్రస్తుతం రాష్ట్రంలోని విలువైన ప్రదేశాల్లో గ్యారేజీలు(Garages), డిపోలు ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం ఆర్టీసీ బస్సులకు సర్వీసింగ్‌ చేస్తున్నారు. వాటిలోనే ప్రైవేటు వాహనాలకు కూడా సర్వీసింగ్‌ సేవలు అందించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇప్పటికే ఆర్టీసీ విజయనగరం, ఏలూరు, కర్నూలుల్లో టైర్‌ సర్వీసింగ్‌ సెంటర్లను నిర్వహిస్తోంది. ప్రైవేటు సర్వీసింగ్‌ సెంటర్ల(Servicing Centers) కంటే మెరుగైన రీతిలో తక్కువ ధరకు వాహనాల సర్వీసింగ్‌ సేవలను అందుబాటులోకి తేవాలని అధికారులు నిర్ణయించారు. ఆర్టీసీ టెక్నికల్‌ స్టాఫ్‌ స్కిల్డ్‌ సేవలు అందిస్తారు. అన్‌స్కిల్డ్‌ సేవల కోసం అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో సిబ్బందిని నియమిస్తారు. ఆర్టీసీ వాహనాలు, ప్రైవేటు వాహనాలకు వేర్వేరుగా ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలను ఏర్పాటు చేస్తారు.

తొలిదశలో భారీ వాహనాలకు సర్వీసింగ్‌ సేవలను అందుబాటులోకి తెస్తారు. అనంతరం కార్లు, ఎస్‌యూవీలు, ఇతర వాహనాల సర్వీసింగ్‌ అందిస్తారు. తొలిదశలో నాలుగైదు కేంద్రాల్లో రెండు నెలల్లో సర్వీసింగ్‌ సేవలను ప్రారంభించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అనంతరం అన్ని ఆర్టీసీ డిపోలు, గ్యారేజీల్లో ప్రైవేటు వాహనాల సర్వీసింగ్‌ సేవలను విస్తరించనున్నారు. ప్రైవేటు సర్వీసింగ్‌ కేంద్రాల కంటే మెరుగైన రీతిలో తక్కువ చార్జీలకు ఆర్టీసీ ఆటోమొబైల్‌ సర్వీసింగ్‌ సేవలు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆర్టీసీ ఈడీ కృష్ణమోహన్‌ చెప్పారు.

Also Read

Petrol Price Today: దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. పెట్రోల్‌తో పోటీపడుతోన్న డీజిల్‌..

Viral Video: కచ్చ బాదం డ్యాన్స్‌ ఇలాగా మీరెప్పుడు చూసి ఉండరు !!

Tirupati: నిశ్చితార్థానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి