APPSC Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. ఈ రెండు రోజులు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్ పనిచేయదు!
కమిషన్ అధికారిక వెబ్‌సైట్ రెండు రోజులపాటు నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకనలో తెల్పింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి వార్షిక నిర్వహణ పనుల నిమిత్తం కమిషన్ వెబ్‌సైట్‌ను నిలిపివేస్తున్నట్లు తన ప్రకటనలో వెల్లడించింది. ఆగస్టు 18వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఆగస్టు 20వ తేదీ రాత్రి 9 గంటల వరకు వెబ్‌సైట్ సేవలు ఉండవని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వివిధ నియామక రాత పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ముందే డౌన్‌లోడ్ చేసుకోవాలని, ఆగస్టు 18, 19, 20 తేదీల్లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉండదని ఏపీపీఎస్సీ..

అమరావతి, ఆగస్టు 11: ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ రెండు రోజులపాటు నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకనలో తెల్పింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి వార్షిక నిర్వహణ పనుల నిమిత్తం కమిషన్ వెబ్‌సైట్‌ను నిలిపివేస్తున్నట్లు తన ప్రకటనలో వెల్లడించింది. ఆగస్టు 18వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఆగస్టు 20వ తేదీ రాత్రి 9 గంటల వరకు వెబ్‌సైట్ సేవలు ఉండవని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వివిధ నియామక రాత పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ముందే డౌన్‌లోడ్ చేసుకోవాలని, ఆగస్టు 18, 19, 20 తేదీల్లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉండదని ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఈ మేరకు అభ్యర్ధులు గ్రహించాలని సూచించింది.
తెలంగాణ కేజీబీవీ అధ్యాపక రాత పరీక్ష ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)లో 1241 కాంట్రాక్టు అధ్యాపకుల నియామకాలకు ఇటీవల రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించి ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్‌టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 475 కేజీబీవీలు ఉండగా వీటిల్లో 42 స్పెషల్ ఆఫీసర్ పోస్టులు, 849 పీజీ సీఆర్‌టీ పోస్టులు, 273 సీఆర్‌టీ పోస్టులు, 77 పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి జులైలో ఆన్‌లైన్ విధానంలో రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. సీఆర్‌టీ పోస్టులకు 80 శాతం వెయిటేజీ, టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఇక స్పెషల్ ఆఫీసర్ పోస్టులకు రాత పరీక్షకు 75 శాతం వెయిటేజీ, టెట్ వెయిటేజీ 20 శాతం, టీచింగ్ అనుభవానికి 5 శాతం వెయిటేజీ ఆధారంగా ఎంపిక చేస్తారు. పీజీసీఆర్‌టీ పోస్టులకు రాత పరీక్ష 95 శాతం వెయిటేజీ, పని అనుభవానికి 5 శాతం వెయిటేజీ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. పీఈటీ పోస్టులకు రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మాత్రమే ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.




మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.




