APPSC EO Results 2023: ఏపీపీఎస్సీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మెయిన్స్-2023 ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎండోమెంట్స్ సబ్ సర్వీసులో 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (EO) గ్రేడ్-3 పోస్టుల భర్తీకి నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ బుధవారం (ఏప్రిల్ 12) ప్రకటించింది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మెయిన్స్ ఫలితాలతో పాటు ఈ పరీక్ష ఫైనల్ ఆన్సర్ 'కీ'ని కూడా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎండోమెంట్స్ సబ్ సర్వీసులో 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (EO) గ్రేడ్-3 పోస్టుల భర్తీకి నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ బుధవారం (ఏప్రిల్ 12) ప్రకటించింది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మెయిన్స్ ఫలితాలతో పాటు ఈ పరీక్ష ఫైనల్ ఆన్సర్ ‘కీ’ని కూడా ఏపీపీఎస్సీ విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌చేసుకోవచ్చు.
కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 17న ఆన్‌లైన్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎండోమెంట్స్ సబ్ సర్వీసులో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులందరికీ ఈ నెల 26న ఉదయం 10 గంటలకు విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తన ప్రకటనలో వివరించింది. ఏయే సర్టిఫికెట్లను తీసుకురావాలో కూడా కమిషన్ తన నోట్‌లో పేర్కొంది. ఎంపికైన అభ్యర్ధుల్లో ఎవరైనా వెరిఫికేషన్‌కు హాజరుకాకపోతే మెరిట్ జాబితాలో తదుపరి అభ్యర్థికి అవకాశం కల్పించనున్నట్లు తెల్పింది.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.