Vanitha : ‘తెలుగు మహిళ పేరిట పనీపాట లేని పది మంది పోగై, జూమ్ మీటింగ్ పెట్టుకుని..’ : మంత్రి తానేటి వ‌నిత మండిపాటు

మహిళా సాధికారత కోసం ఇంత చేస్తున్న ముఖ్యమంత్రిని అభినందించకపోయినా ఫర్వాలేదు గానీ..

Vanitha : 'తెలుగు మహిళ పేరిట పనీపాట లేని పది మంది పోగై, జూమ్ మీటింగ్ పెట్టుకుని..' : మంత్రి తానేటి వ‌నిత మండిపాటు
Taneti Vanitha
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 05, 2021 | 8:51 PM

AP women and Children welfare minister Taneti Vanitha : తెలుగు మహిళల పేరుతో పనీపాట లేని పది మంది మహిళలు పోగై, ఒక జూమ్ మీటింగ్ పెట్టుకుని మహిళలకు చేసింది ఏమిటి.. అంటూ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు అన్నారు ఆంధ్రప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత. రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం ఇంత చేస్తున్న ముఖ్యమంత్రిని అభినందించకపోయినా ఫర్వాలేదు గానీ, విమర్శించడం అంటే మహిళలుగా మనల్ని మనం అవమానించుకోవడమే అని ఆమె అన్నారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కొవ్వూరులో మంత్రి తానేటి వ‌నిత మీడియాతో మాట్లాడారు. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఇవాళ రూ. 51 వేల కోట్లతో 31 లక్షల మందికి ఒకేసారి ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం జరిగిందన్నారు. 15.60 లక్షల ఇళ్ళకు భూమి పూజ జరిగింది.. మహిళ పేరుతోనే ఇళ్ళు రాబోతున్నాయని ఆమె తెలిపారు.

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలే రాష్ట్రంలోని మ‌హిళ‌ల‌కు శ్రీ‌రామ ర‌క్ష అని మంత్రి చెప్పుకొచ్చారు. మహిళలు బాగుంటేనే వారి ఇల్లు బాగుంటుందని, తద్వారా సమాజం, రాష్ట్రం బాగుంటుందని నమ్మి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాల ద్వారా వేల కోట్ల రూపాయలను నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నార‌ని చెప్పారు. జగనన్న పరిపాలనలో ప్రతి పథకంలో మహిళలకు పెద్ద పీట వేశారన్న ఆమె. . అగ్రతాంబూలం మహిళలకే దక్కిందన్నారు.

ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ) ద్వారా ఆయా సంక్షేమ పథకాల వల్ల దాదాపు రూ. 57 వేల కోట్లు మహిళల అకౌంట్లలో నేరుగా జమ అయ్యాయని మంత్రి వనిత వివరించారు. పరోక్షంగా మరో రూ. 31 వేల కోట్లు మహిళలకు లబ్ధి జరిగిందన్నారు. అంటే మొత్తం 88 వేల కోట్ల రూపాయలు కేవలం రెండేళ్ళలోనే మహిళలకు లబ్ధి చేకూరిందని తేనేటి వనిత వెల్లడించారు.

Read also : Chittoor : ప్రేమంటూ యువతిని చంపి, తనూ గొంతుకోసుకుని.. స్పాట్‌లోనే ఆమె తమ్ముడి చేతిలో చనిపోయి.! : సుష్మిత, చిన్నా హత్యల ఉదంతం