ఏపీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు..
AP Weather Report : ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టంనకు ౦.9 కి. మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం
AP Weather Report : ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టంనకు ౦.9 కి. మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం నెలకొని ఉంది. దీని ప్రభావం వల్ల ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రధానంగా తక్కువ ఎత్తులో దక్షిణ , ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి.
1. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం.. ఈ రోజు ఉరుములు, మెరుపులతో కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములు, మెరుపులతో పాటు ఒకటి లేదా రెండు చోట్ల నామమాత్ర వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి జల్లులు పడే అవకాశం ఉంది. గంటకు 30-40 కి. మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
2. దక్షిణ కోస్తా ఆంధ్ర.. ఈరోజు, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు ఒకటి లేదా రెండు చోట్ల, తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచన.
3. రాయలసీమ.. ఈ రోజు ఉరుములు, మెరుపులతో పాటు ఒకటి లేదా రెండు చోట్ల, తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావారణ కేంద్రం తెలిపింది.