AP Rain Alert: రాగల మూడురోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు
AP Rain Alert: రెండు రోజులు ఆలస్యంగా కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాలు..
AP Rain Alert: రెండు రోజులు ఆలస్యంగా కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాలు అంతటా; ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని ప్రాంతాలలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుండి మరట్వాడ, తెలంగాణ, రాయలసీమల మీదుగా ఉత్తర తమిళనాడు వరకు 0.9 km ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీంతో తెలంగాణలో రెండు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు అడుగు పెట్టాయి. దీంతో తెలంగాణలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. రాగాల మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వాతావరణం సూచనను అధికారులు ఇచ్చారు.
ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రా, దక్షిణ కోస్తా ఆంధ్ర, తో పాటు యానాం వంటి ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
మరోవైపు రాయలసీమలో కూడా ఈ రోజు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురుస్తున్నాయి. అంతేకాదు రాగాల రెండు రోజుల్లో రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది.
Also Read: కరోనా నుంచి రక్షణ కోసం రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి నవరత్నాల ఆహారం