AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: క‌రోనాతో మృతి చెందిన తండ్రికి అంత్య‌క్రియలు చేయ‌ని కొడుకు.. చివ‌ర‌కు భార్యే

కరోనా మహమ్మారి మనుషుల్లో బంధాలను బంధుత్వాలను పలచన చేస్తుంది. సొంతవారిని కూడా దగ్గరకు రాకుండా భయపెడుతుంది. మృతదేహాలను

Coronavirus: క‌రోనాతో మృతి చెందిన తండ్రికి అంత్య‌క్రియలు చేయ‌ని కొడుకు.. చివ‌ర‌కు భార్యే
Corona Deaths
Ram Naramaneni
|

Updated on: Jun 06, 2021 | 4:20 PM

Share

కరోనా మహమ్మారి మనుషుల్లో బంధాలను బంధుత్వాలను పలచన చేస్తుంది. సొంతవారిని కూడా దగ్గరకు రాకుండా భయపెడుతుంది. మృతదేహాలను చూసేందుకు కూడా భయపడేలా చేస్తుంది. బంధువులు ఎందరు ఉన్నా కొందరు కరోనా బాధితులు అనాథలుగా మిగిలిపోతున్నారు. ఎవరు దగ్గరికి రాకపోవడంతో క‌రోనాతో చ‌నిపోయిన‌వారికి మానవత్వం కలిగిన వారు అంత్యక్రియలు చేస్తున్నారు. తాజాగా కృష్ణాజిల్లాలో మానవత్వం మంట కలిసిన సంఘటన వెలుగు చూసింది. మచిలీపట్నం మాచవరానికి చెందిన ప్రసాద్‌ అనే వ్యక్తి కరోనా సోక‌డంతో ప‌రిస్థితి విష‌మించి మృతి చెందాడు. దీంతో అతని కొడుకు ప్రసాద్‌ అంత్యక్రియలతో తనకేమి సంబంధంలేదని చేతులేత్తేశారు. పైగా మృతదేహన్ని వదిలేసి వెళ్లిపోయాడు. మంత్రి పేర్నినానికి విషయం తెలిసింది. ప్రసాద్‌ అంత్యక్రియలపై మంత్రి స్పందించారు. దహన సంస్కారాలకు అవసరమైన ఆర్ధిక సహాయం అందజేశారు. దీంతో ప్రసాద్‌ భార్య నాగమణి భర్తకు తలకొరివి పెట్టి దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు ఒక‌టి కాదు, రెండు కాదు.. దేశ‌వ్యాప్తంగా నిత్యం అనేకం వెలుగుచూస్తున్నాయి. మ‌నుషుల్లోని విలువ‌ల్ని, మాన‌వ‌త్వాన్ని ప్ర‌శ్నిస్తూనే ఉన్నాయి

Also Read: బెజ‌వాడ‌లో కిలాడీ లేడీ.. మాయ చేసి.. ముంచేస్తుంది…

పైనుంచి చూస్తే పుచ్చకాయ‌ల లోడులాగే ఉంది.. అడుగున చెక్ చేసి కంగుతిన్న పోలీసులు

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్