Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Alert: వర్షాలే వర్షాలు.. వచ్చే 3 రోజలు ఏపీకి రెయిన్ అలర్ట్.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ వచ్చేసింది..

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలు ఎండ ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. సాయంత్రం వేళల్లో వర్షం కురుస్తోంది.. ఈ క్రమంలో అమరావతి వాతావరణ కేంద్రం.. అలర్ట్ జారీ చేసింది. ఒక ద్రోణి పశ్చిమ రాజస్థాన్ నుండి తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, విదర్భ, మరాఠ్వాడ, అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది.

Rain Alert: వర్షాలే వర్షాలు.. వచ్చే 3 రోజలు ఏపీకి రెయిన్ అలర్ట్.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ వచ్చేసింది..
Ap Rain Alert
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 14, 2025 | 1:44 PM

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలు ఎండ ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. సాయంత్రం వేళల్లో వర్షం కురుస్తోంది.. ఈ క్రమంలో అమరావతి వాతావరణ కేంద్రం.. అలర్ట్ జారీ చేసింది. ఒక ద్రోణి పశ్చిమ రాజస్థాన్ నుండి తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, విదర్భ, మరాఠ్వాడ, అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. ఒక ద్రోణి ఈశాన్య మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలలలో ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణ తీరప్రాంత ఒడిశా వరకు ఛత్తీస్‌గఢ్ మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంతాలు, యానాం, పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. దిగువ ట్రోపో ఆవరణములో ఆంధ్ర ప్రదేశ్, యానములో ఈశాన్య, ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి..

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం:-

సోమవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

మంగళవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

సోమవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

మంగళవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

బుధవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

రాయలసీమ:-

సోమవారం, మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 30 -40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

గమనిక:- కోస్తా ఆంద్రప్రదేశ్, యానాంలో రాగల ఐదు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పముగా తగ్గే అవకాశముంది. రాయలసీమలో రేపటి గరిష్ట ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పులేకపోవచ్చు. తరువాత గరిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పముగా తగ్గే అవకాశముందని.. అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటనలో తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ బ్యాగు వద్ద ఆగిన పోలీస్ డాగ్.. పోలీసులు ఓపెన్ చేయగా షాక్
ఆ బ్యాగు వద్ద ఆగిన పోలీస్ డాగ్.. పోలీసులు ఓపెన్ చేయగా షాక్
నోరు తెరిచి నిద్రపోయేవారిలో ఈ రిస్క్.. మీకూ ఈ అలవాటుందా?
నోరు తెరిచి నిద్రపోయేవారిలో ఈ రిస్క్.. మీకూ ఈ అలవాటుందా?
ఎముకలను ఉక్కులా మార్చే సూప్.. ఇలా చేయండి
ఎముకలను ఉక్కులా మార్చే సూప్.. ఇలా చేయండి
గోనెసంచితో అస్పత్రికొచ్చిన యువకుడు.. లోపల ఏముందని చూడగా..
గోనెసంచితో అస్పత్రికొచ్చిన యువకుడు.. లోపల ఏముందని చూడగా..
వాషింగ్ మెషీన్‌ను ఇంట్లో ఇక్కడుంచితే పనుల్లో విజయం సాధిస్తారు
వాషింగ్ మెషీన్‌ను ఇంట్లో ఇక్కడుంచితే పనుల్లో విజయం సాధిస్తారు
440కి 434 మార్కులొచ్చాయనీ..ఈ అమ్మాయి ఎలా ఏడుస్తుందో చూడండి! Video
440కి 434 మార్కులొచ్చాయనీ..ఈ అమ్మాయి ఎలా ఏడుస్తుందో చూడండి! Video
కాసిన్ని నీళ్లు కావాలంటూ ఇంట్లోకి దూరారు.. ఆమె లోపలికి వెళ్లగానే.
కాసిన్ని నీళ్లు కావాలంటూ ఇంట్లోకి దూరారు.. ఆమె లోపలికి వెళ్లగానే.
PSLలో IPL.. అవార్డుల వేడుకలో పాక్ దిగ్గజం బ్లండర్ మిస్టేక్
PSLలో IPL.. అవార్డుల వేడుకలో పాక్ దిగ్గజం బ్లండర్ మిస్టేక్
కర్కాటక రాశిలో కుజ సంచారం ఎవరికీ మంచిది? ఎవరి కష్టాలు తెస్తాయంటే
కర్కాటక రాశిలో కుజ సంచారం ఎవరికీ మంచిది? ఎవరి కష్టాలు తెస్తాయంటే
వాష్ బేసిన్‌లో ఈ హ్యాక్ గురించి మీకు తెలుసా?
వాష్ బేసిన్‌లో ఈ హ్యాక్ గురించి మీకు తెలుసా?
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..