AP Rains: ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్
ఏపీని వర్షాలు వీడట్లేదు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే 3 రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. మరి ఏయే ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి.? మరి ఏయే ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయి.? అనే విషయాలు ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..
నిన్నటి బాగా గుర్తించబడిన అల్పపీడనం ఈరోజు డిసెంబర్ 25 , 2024, ఉదయము 8.30 గంటకు నైరుతి & ప్రక్కనే ఉన్న పశ్చిమద్య బంగాళాఖాతం దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాలలో కేంద్రీకృతమై ఉన్నది. వచ్చే 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడన ప్రాంతంగా క్రమంగా బలహీనపడుతుంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు.
ఇది చదవండి: ట్రైన్ ఏసీ భోగీలో చెక్ చేస్తూ.. ఓ బెర్త్ కింద కనిపించింది చూడగా
————— ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :- —————————————-
ఈరోజు:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాసముంది.
రేపు, ఎల్లుండి:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :- ——————————
ఈరోజు:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
రేపు:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఎల్లుండి:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
రాయలసీమ:-
ఈరోజు, రేపు:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
ఎల్లుండి:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది
ఇది చదవండి: బాబు బంగారం.! 20 బంతుల్లో మ్యాచ్ మడతెట్టేసాడు.. కట్ చేస్తే.. 9 నెంబర్‌లో తుఫాన్ ఇన్నింగ్స్
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..