Andhra Pradesh: 10వ తరగతి విద్యార్థులకు అలెర్ట్.. రిజల్ట్స్ డేట్ వచ్చేసింది
ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంవత్సరం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు 6 లక్షల 19 వేల 275 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరింతా రిజల్ట్ కోసం ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. తాజాగా పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదలపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి..

ఏపీ స్టేట్ ప్రభుత్వ పరీక్షల విభాగం నుంచి ఓ ముఖ్యమైన ప్రకటన వెలువడింది. ఇది విద్యార్థుల జీవితాల్లో మలుపు తిప్పే రోజు అని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. గత నెలలో నిర్వహించిన పదో తరగతి పరీక్షల ఫలితాలను ఈ నెల ఇరవై మూడవ తేదీ ఉదయం విడుదల చేయనున్నట్టు విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు తెలిపారు.
ఈ ఫలితాలను తెలుసుకోవడానికి విద్యార్థులకు పలు మార్గాలు అందుబాటులో ఉంచారు. అధికారిక వెబ్‌సైట్లు( https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in ), వాట్సాప్‌లో మన మిత్ర అనే సదుపాయం, అలాగే లీప్ యాప్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. ముఖ్యంగా వాట్సాప్‌లో 9552300009 నంబర్‌కు “హాయ్” అని మెసేజ్ పంపి, అక్కడి నుండి విద్యా సేవలను ఎంచుకుని, తమ పరీక్షల ఫలితాలను పొందే అవకాశం ఉంది. అలానే టీవీ9 వెబ్‌సైట్‌లో కూడా టెన్త్ విద్యార్థులు రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. ఫలితాలను తెలుసుకోవడానికి విద్యార్థులు తమ రోల్ నంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో, వారు తమ ఫలితాల పీడీఎఫ్ కాపీని పొందగలుగుతారు.
పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ స్కూల్ లాగిన్ ద్వారా ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లీప్ యాప్ లో ఉపాధ్యాయులు, విద్యార్థులకు ప్రత్యేక లాగిన్‌లు ఏర్పాటు చేసి ఉన్నాయి. ఈ విధంగా, డిజిటల్ పద్ధతులను వినియోగంలోకి తీసుకొచ్చి విద్యార్థులకు ఫలితాలు తెలుసుకోవడం సులభతరం చేసిన విద్యాశాఖ చర్యలు అభినందనీయం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
