Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఏకంగా వాట్సాప్‌ స్టేటస్‌లు పెట్టి ఎంత మాయ చేశార్రా..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగ యువతను లక్షల రూపాయలు మోసం చేసిన ముఠా విజయనగరం జిల్లాలో అరెస్టైంది. నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు, ఐడీ కార్డులు ఇచ్చి 50 లక్షల రూపాయలకు పైగా వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడు సుజిత్‌తో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Andhra: ఏకంగా వాట్సాప్‌ స్టేటస్‌లు పెట్టి ఎంత మాయ చేశార్రా..
Job Scam Accused With Police
Follow us
Gamidi Koteswara Rao

| Edited By: Ram Naramaneni

Updated on: Jun 07, 2025 | 7:26 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షల రూపాయలు కాజేసిన ఘరానా మోసం విజయనగరం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాల పేరిట ఆశ చూపిస్తూ ఫోన్ స్టేటస్ పెట్టి యువతను మోసం చేసిన ఓ ముఠాను విజయనగరం వన్ టౌన్ పోలీసు బృందం అరెస్ట్ చేసింది. ఎస్.కోట మండలం ధర్మవరం గ్రామానికి చెందిన వినోద్ అనే బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఈ మోసం వెనుక ఉన్న గుట్టురట్టు అయ్యింది. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, జంగారెడ్డిగూడెం, విజయనగరం జిల్లాల నుంచి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న పలువురు యువకుల నుంచి ఈ ముఠా ఒక్కొక్కరి వద్ద 5 నుంచి 8 లక్షల రూపాయల వరకు వసూలు చేసింది. బాధితులకు నకిలీ కంపెనీ అపాయింట్‌మెంట్ లెటర్లు, ఐడీ కార్డులు ఇచ్చి మోసం చేశారు.

ఈ ముఠాలోని కీలక వ్యక్తి అయిన సుజిత్ నిరుద్యోగ యువతను అమరావతిలోని సచివాలయం వద్దకు తీసుకెళ్లి, అక్కడ తనకు అందరితో పరిచయాలున్నాయని నమ్మించాడు. అక్కడ వారం రోజుల పాటు వారిని ఉంచి, భోజనాలు పెట్టించి, నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చి ఉద్యోగాలు ఖాయమని బాధితులను నమ్మించాడు. అయితే అపాయింట్‌మెంట్ లెటర్లలో ఉన్న అడ్రస్‌ను సంప్రదించగా, అవి నకిలీవని తేలడంతో బాధితులు మోసపోయినట్లు గుర్తించారు. దీంతో వారు విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ కేసులో విజయనగరం జిల్లాకు చెందిన మహేష్, జంగారెడ్డిగూడెంకు చెందిన రుబీ, ఏలూరుకు చెందిన జాన్, యాకుబ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు విజయనగరం ప్రదీప్ నగర్‌కు చెందిన సుజిత్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఈ ముఠా నిరుద్యోగుల వద్ద దాదాపు 50 లక్షల రూపాయలను వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నడిరోడ్డుపై దారుణంగా కొట్టుకున్న యువతీ యువకుడు..
నడిరోడ్డుపై దారుణంగా కొట్టుకున్న యువతీ యువకుడు..
పాన్‌ కార్డు ఉన్నవారికి అలర్ట్‌.. ఇది చేయకపోతే భారీ ఫైన్‌
పాన్‌ కార్డు ఉన్నవారికి అలర్ట్‌.. ఇది చేయకపోతే భారీ ఫైన్‌
కూల్‌ న్యూస్‌.. యూపీఐ పేమెంట్లపై ఛార్జీల్లేవ్.. కేంద్రం క్లారిటీ
కూల్‌ న్యూస్‌.. యూపీఐ పేమెంట్లపై ఛార్జీల్లేవ్.. కేంద్రం క్లారిటీ
బైపాస్‌ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్‌
బైపాస్‌ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్‌
అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో
అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో
ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే
ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే
కారు డ్రైవర్‌ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..
కారు డ్రైవర్‌ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..
తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా
తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా
మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం
మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం
రూ.500 నోటుపై స్టార్‌ గుర్తు.. ఇది నకిలీదా..ఆర్బీఐ ఏం చెబుతోంది?
రూ.500 నోటుపై స్టార్‌ గుర్తు.. ఇది నకిలీదా..ఆర్బీఐ ఏం చెబుతోంది?