AP: ఏపీలో కరెంట్ కోతల కల్లోలం.. ఆస్పత్రుల్లో దారుణ పరిస్థితులు.. నరకం చూస్తున్న రోగులు

పవర్ కట్స్‌తో ఏపీ ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రిలో కరెంట్‌ లేక పసికందులతో బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది.

AP: ఏపీలో కరెంట్ కోతల కల్లోలం.. ఆస్పత్రుల్లో దారుణ పరిస్థితులు.. నరకం చూస్తున్న రోగులు
Power Cuts
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 07, 2022 | 11:27 AM

Ap power cuts:ఒకవైపు నిప్పులు కక్కుతున్న సూరీడు..మరోవైపు ఉక్కపోత..వీటికితోడు అంధకారం..చీకట్లలో పాముల బెడద. ఎస్..ఏపీలో విద్యుత్ కోతలతో విలవిలలాడిపోతున్నారు జనం. మండువేసవిలో కరెంట్ లేక అల్లాడిపోతున్నారు. పల్లెలతో పాటు ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు సేమ్‌ సీన్‌. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలాంటి ప్రధాన నగరాల్లోనూ ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో కోతలు విధిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. పవర్‌ కట్స్‌తో విలవిలలాడిపోతున్నారు ప్రజలు. అర్థరాత్రి విద్యుత్ కోతలతో వారి బాధలు వర్ణణాతీతంగా మారాయి. ముఖ్యంలో కోనసీమ(Konaseema) రాత్రివేళ అంధకారంలోకి వెళ్లిపోతుంది. అర్థరాత్రి పవర్‌ కట్స్‌తో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఒకవైపు విద్యుత్‌ కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. మరోవైపు పాముల బెడదతో వణికిపోతున్నారు. కరెంట్‌ లేక చీకట్లు కమ్ముకోవడంతో ఇళ్లలోకి చొరబడుతున్నాయి పాములు. అమలాపురం(Amalapuram) రూరల్‌ మండలం విలసవిల్లిలో ఓ ఇంట్లోకి చొరబడింది భారీ తాచుపాము. దీంతో భయంతో పరుగులు పెట్టారు జనం. ఐతే స్నేక్‌ కేచర్‌ వచ్చి పామును పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది.

గత 10 రోజులుగా అప్రకటిత విద్యుత్‌ కోతలతో నానా అవస్థలు పడుతున్నారు జనం. పవర్ కట్స్‌తో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రిలో కరెంట్‌ లేక పసికందులతో బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనరేటర్‌ వేయాలన్నా డీజిల్ లేదంటూ చేతులెత్తేశారు ఆస్పత్రి సిబ్బంది. ఇక నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలోనూ ఎమర్జెన్సీ ఆపరేషన్స్‌ కూడా చేయలేని పరిస్థితి. గర్భిణులకు కూడా చీకట్లోనే డెలివరీ చేయాల్సివస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిస్కంలు లోటు విద్యుత్‌గా చూపుతున్న మొత్తాన్ని సర్దుబాటు చేయటానికి అత్యవసర లోడ్‌ రిలీఫ్‌ పేరిట విద్యుత్ సంస్థలు కోతలు విధిస్తున్నాయి. వేసవిలో డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ను సమకూర్చుకోవడంపై డిస్కంలు ఫోకస్ పెట్టలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరెంట్ కోతల నేపథ్యంలో.. ఫిర్యాదు కేంద్రాలకు తెగ కాల్స్ చేస్తున్నారు ప్రజలు. కొందరు కనీసం ఏయే సమయాల్లో కరెంట్ పోతుందో చెప్పాలని వేడుకుంటున్నారు.  ప్రభుత్వం ఈ ఇష్యూపై సీరియస్‌గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది.

Also Read: శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం.. ఒక్క భారత రూపాయి విలువ అక్కడెంతో తెలుసా..?