Hardhenu Cow: రోజుకి 55-60 లీటర్ల పాలిచ్చే మేలు జాతి ఆవు.. పాడి రైతులకు లాభాలే లాభాలు
Hardhenu Cow: దేశంలో ఏటా అనేకమంది రైతులు వ్యవసాయంలో ప్రకృతి వైపరీత్యం వంటి అనేక కారణాలతో భారీగా నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్రమంగా రైతులు(Farmers) ఆర్ధిక..
Hardhenu Cow: దేశంలో ఏటా అనేకమంది రైతులు వ్యవసాయంలో ప్రకృతి వైపరీత్యం వంటి అనేక కారణాలతో భారీగా నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్రమంగా రైతులు(Farmers) ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారిలో వ్యవసాయం(farming) చేయాలనే ఆసక్తి కూడా సన్నగిల్లుతుంది. దీంతో రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోంది. పాడి రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పుడిప్పుడే మెల్లగా ఇప్పుడు దీని ప్రభావం కనిపిస్తోంది.
పాడి రైతులను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆర్థిక సహాయం అందిస్తున్నాయి. పశువులను పెంచే వ్యాపారంపై ఆసక్తి ఉన్న వారి కోసం ఈరోజు ఇతర జాతుల కంటే ఎక్కువ పాలను ఇచ్చే మేలైన జాతి ఆవు గురించి ఈరోజు తెలుసుకుందాం.. ఈ ఆవుల పెంపకంతో పశువుల యజమానుల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.
గత కొన్నేళ్లుగా హర్ధేను ఆవును పెంచాలని నిపుణులు రైతులకు సలహా ఇస్తున్నారు. ఈ ఆవు ప్రత్యేకత ఏమిటంటే.ఇది రోజుకు 50-55 లీటర్ల పాలను ఇస్తుంది. దీనిని హర్యానాలోని లాలా లజపత్ రాయ్ యూనివర్సిటీ ఆఫ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్స్ (లువాస్) శాస్త్రవేత్తలు మూడు జాతులను కలిపి తయారు చేశారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ హర్ధేను జాతిని ఉత్తర-అమెరికన్ (హోల్‌స్టెయిన్ ఫ్రిజ్న్), స్వదేశీ హర్యానా, సాహివాల్ జాతికి చెందిన క్రాస్ బ్రీడ్ నుండి ప్రత్యేకంగా తయారు చేశారు.
హర్ధేను ఆవు గురించి చెప్పాలంటే, ఈ జాతికి పాల సామర్థ్యం ఇతర జాతుల ఆవుల కంటే ఎక్కువ. దీని పాల రంగు ఇతర ఆవుల కంటే తెల్లగా ఉంటుంది. ఇతర ఆవులు సగటున 5-6 లీటర్ల పాలు ఇస్తే, హర్ధేను ఆవు రోజుకు సగటున 15-16 లీటర్ల పాలను ఇస్తుంది. అయితే ఆవుకు తగిన పోషణ, మేత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే రోజుకు సుమారు 55-60 లీటర్ల ఇచ్చే పాల సామర్థ్యం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: Viral Video: సోఫాలో దర్జాగా చుట్టుకుని నిద్రపోతున్న ర్యాట్ స్నేక్.. నెట్టింట్లో వీడియో వైరల్