TDP vs YSRCP: తగ్గేదేలే..ఇప్పటి వరకు ఒక లెక్క. ఇకపై మరో లెక్క.. ఇక ఢిల్లీకి చేరనున్న ఏపీ రచ్చ
టీడీపీ- వైసీపీ పోటాపోటీ దీక్షలు-నిరసనలు. ఇప్పటి వరకు ఒక లెక్క.! ఇకపై మరో లెక్క.! వార్ నెక్ట్స్ లెవల్‌కి చేరింది. సీన్ ఢిల్లీకి మారనుంది. హస్తిన వీధుల్లో తేల్చుకునేందుకు ఆ రెండు పార్టీలు సిద్ధమయ్యాయి.

టీడీపీ- వైసీపీ పోటాపోటీ దీక్షలు-నిరసనలు. ఇప్పటి వరకు ఒక లెక్క.! ఇకపై మరో లెక్క.! వార్ నెక్ట్స్ లెవల్‌కి చేరింది. సీన్ ఢిల్లీకి మారనుంది. హస్తిన వీధుల్లో తేల్చుకునేందుకు ఆ రెండు పార్టీలు సిద్ధమయ్యాయి. అటు రాజ్‌భవన్ గడప కూడా తొక్కారు టీడీపీ నేతలు.. ఇక పట్టాభికి నవంబర్2 వరకు రిమాండ్ విధించి కోర్టు..
ఏపీలో ప్రజెంట్ పొలిటికల్ సిట్యుయేషన్ తగ్గేదేలే..అన్నట్లు సాగుతోంది. ఏపీ రచ్చ ఇక ఢిల్లీకి చేరనుంది. రాష్ట్రంలో పోటాపోటీ దీక్షలు, నిరసనలతో హోరెత్తిస్తున్న టీడీపీ-వైసీపీ ఇప్పుడు హస్తినమే సవాల్ అంటున్నాయి. ఢిల్లీ వేదికగా బలప్రదర్శనకు రెడీ అవుతున్నాయి. దీక్ష ముగిసిన వెంటనే దేశ రాజధానికి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు చంద్రబాబు. హోంమంత్రి అమిత్‌షాను కలిసి రాష్ట్రంలో పరిస్థితిని వివరించాలని భావిస్తున్నారు. అటు వైసీపీ నేతలు కూడా హస్తిన యాత్రకు సై అంటున్నారు.. అమిత్‌షాతోపాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు ప్లాన్ చేస్తున్నారు. టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని కోరనున్నారు.
గవర్నర్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు
అటు టీడీపీ ఆఫీసులపై జరిగిన దాడి ఘటనను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు టీడీపీ నేతలు. రాష్ట్రపతి పాలన విధించడంతోపాటు..CBI విచారణ జరపించాలని కోరారు.
వైసీపీ స్టేట్ వైడ్ జనాగ్రహ దీక్షలు
అటు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు జనాగ్రహ దీక్షలు చేపట్టారు. సీఎం జగన్‌పై టీడీపీ లీడర్స్ చేస్తోన్న బూతు కామెంట్స్‌కు నిరసన తెలుపుతున్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్ తన సొంత నియోజకవర్గం భీమిలిలో దీక్ష చేపట్టారు. బూతులు తిట్టించడం, రెచ్చగొట్టడం… ఇదేనా నీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవం అంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
నగరి ఎమ్మెల్యే రోజా పుత్తూరులో నిరసన ప్రదర్శ చేపట్టారు. చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వైసీపీ జనాగ్రహ దీక్షల్లో వింతైన దృశ్యాలు కూడా కనిపించాయ్. నిరసన ప్రదర్శనల్లో ఎవరైనా ఏం చేస్తారు… ర్యాలీ చేస్తారు… నినాదాలు చేస్తారు. మహా అయితే దిష్టిబొమ్మ దగ్ధం చేస్తారు… కానీ, వైసీపీ కార్యకర్తలు అంతకు మించి అన్నట్టు చేస్తున్నారు. రాజమండ్రిలో ఎంపీ భరత్ జనాగ్రహ ర్యాలీ చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ లీడర్లు చేసిన బూతు కామెంట్స్‌పై తమ నిరసన తెలిపారు. అంతవరకు బాగానే ఉంది. కానీ, అసలు సీన్ ఇక్కడే మొదలైంది. చంద్రబాబుపై తమకున్న కోపాన్ని వెరైటీగా చూపించారు.
సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలోనూ వైసీపీ నేతలు జనాగ్రహ దీక్షలు చేపట్టారు. బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం దగ్గర దీక్షలో కూర్చున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై టీడీపీ నేతలు చేసిన బూతు కామెంట్స్‌పై నిరసన తెలుపుతున్నారు.
పట్టాభికి 14 రోజుల రిమాండ్..
అటు టీడీపీ నేత పట్టాభికి 14 రోజుల రిమాండ్ ఖరారైంది. నవంబర్2 వరకు రిమాండ్ విధించింది కోర్టు. సీఎం జగన్‌పై అనుచిత కామెంట్స్ కేసులో అరెస్టయ్యారు పట్టాభి. మరోవైపు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు. తోట్లవల్లూరు పీఎస్ నుంచి విజయవాడ తీసుకొచ్చిన పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. స్టేషన్ బెయిల్ ఇవ్వాలని పట్టాభి తరఫు న్యాయవాది కోరారు. అయితే ఆయనపై గతంలోనే అనేక కేసులు ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు ప్రభుత్వ లాయర్ . ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధించారు. తర్వాత మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు. అంతకుముందు ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.
Also Read..