Viral Video: వ్యాక్సిన్ ఇస్తే పాముతో కరిపిస్తా.. మహిళ చేసిన పనితో భయంతో వైద్య సిబ్బంది పరుగులు.. వీడియో..
Woman threatens medical team with Snake: కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. చాలాప్రాంతాల్లోని ప్రజలు స్వతహాగా ముందుకొచ్చి
Woman threatens medical team with Snake: కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. చాలాప్రాంతాల్లోని ప్రజలు స్వతహాగా ముందుకొచ్చి వ్యాక్సిన్‌ను తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో వైద్య సిబ్బంది కూడా డోర్ టూ డోర్ తిరుగుతూ.. వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. అయితే.. వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమై దాదాపు పది నెలలు పూర్తయినప్పటికీ.. కొంతమంది లేనిపోని అపోహలు, భయాలు ఏర్పరుచుకుని కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. కోవిడ్-19 వ్యాక్సిన్‌పై అవగాహన కల్పి్స్తున్నా.. చాలా మంది వినిపించుకోకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని వ్యాక్సిన్ వద్దంటూ పేర్కొంటున్నారు. తాజాగా వ్యాక్సిన్ వేసేందుకు వెళ్లిన సిబ్బందిని.. ఓ మహిళ బెదిరించింది. తనకు వ్యాక్సిన్ వేయడానికి వస్తే.. నాగుపాముతో కరిపిస్తానంటూ పామును బయటకు తీయడంతో వైద్య సిబ్బంది ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. ఈ షాకింగ్ సంఘటన రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలోని పిసాంగన్ ప్రాంతంలోని నాగెలావ్ గ్రామంలో చోటుచేసుకుంది.
డోర్ టు డోర్ వ్యాక్సినేషన్‌లో భాగంగా వైద్య సిబ్బంది నాగెలావ్ గ్రామానికి వెళ్లారు. గిరిజన గ్రామం కావడంతో అందరికీ అవగాహన కల్పిస్తూ.. వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఈ గ్రామంలో చాలామంది పాములాట ఆడించుకుంటూ బతికే వారే ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో సిబ్బంది గ్రామంలోని కమలా దేవి ఇంటికి వెళ్లారు. వ్యాక్సిన్ తీసుకోవాలంటూ సిబ్బంది ఆమెను కోరగా.. తీసుకోనంటూ స్పష్టంచేసింది. దీంతో సిబ్బంది వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పించి టీకా ఇచ్చే ప్రయత్నం చేయగా.. ఆమె బుట్టలోనుంచి నాగు పామును బయటకు తీసింది. తనకు వ్యాక్సిన్ వేసేందుకు ప్రయత్నిస్తే పాముతో కరిపిస్తానంటూ హంగామా చేసింది. బుసలు కొడుతున్న పామును చూసి వైద్య సిబ్బంది పరుగులు తీశారు.
వైరల్ వీడియో..
जब कोरोना टीकाकरण करने गई चिकित्सा टीम को सपेरन ने पिटारे में बंद कोबरा सांप को बाहर निकाल कर डराया Don’t you dare to #Jab me, women to vaccination team!#Viral @aditytiwarilive pic.twitter.com/yWyGPwNF4Q
— Natansh Patel (@Natansh_Patel) October 18, 2021
ఆ తర్వాత వైద్య సిబ్బంది కొందరు గ్రామస్థులకు చెప్పగా.. వారొచ్చి కమాలాదేవికి నచ్చజెప్పారు. వ్యాక్సిన్ తీసుకుంటే.. ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పారు. అనంతరం కొన్ని గంటల తర్వాత ఆమె వ్యాక్సిన్ తీసుకునేందుకు ఒప్పుకుంది. గ్రామస్థుల సహకారంతో కమలాదేవి కుటుంబానికి వ్యాక్సిన్ ఇచ్చామని వైద్య సిబ్బంది తెలిపారు.
Also Read: