Horrible Experience: అబ్బా.. ఛీ.. ఆకాశంలోంచి వ్యక్తి నెత్తిపై మానవ విసర్జితాలు.. ఆ పని ఎవరిదో తెలిసి అవాక్కు!

కొన్ని విషయాలు చెప్పుకోలేని విధంగా ఉంటాయి. అరుదుగా జరిగినా.. ఆ సంఘటనల బారిన పడిన వారి అవస్థలు చెప్పలేని విధంగా ఉంటాయి. అవి విన్నవారికీ ఆ విషయాలు నవ్వు తెప్పిస్తాయి. కానీ, అనుభవించిన వారికి మాత్రం అది దారుణ అనుభవంగా మిగిలిపోతుంది.

Horrible Experience: అబ్బా.. ఛీ.. ఆకాశంలోంచి వ్యక్తి నెత్తిపై మానవ విసర్జితాలు.. ఆ పని ఎవరిదో తెలిసి అవాక్కు!
Horrible Experience

Horrible Experience: విమానం సిబ్బంది చేసిన చిత్తడి పని ఒక రైతును తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ఈ సంఘటన యూకేలోని విండ్సర్ ప్రాంతంలో జరిగింది. ఒక విమానం ఆ ప్రాంతంలో ఎగురుతూ మానవ విసర్జితాలను నేలపైకి వదిలివేసింది. ఆ విసర్జితాలు అక్కడ ఒక తోట మీద పడ్డాయి. ఆ ఆసమయంలో తోటలో పనిచేసుకుంటున్న రైతు మీద కూడా ఆ విసర్జితాలు పడ్డాయి. దీంతో ఆ రైతు షాక్ అయ్యాడు. ఈ సంఘటన జూలై నెలలో జరిగింది. అయితే, ఇటీవల దీనిని అక్కడి స్థానిక కౌన్సిలర్ కరెన్ డేవిస్ రాయల్ బోరో ఆఫ్ విండ్సర్ మైడెన్‌హెడ్ ఏవియేషన్ ఫోరం దృష్టికి తీసుకువెళ్ళారు. దాంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. విమానం నుంచి పడిన మానవ వ్యర్దాలతో ఆ వ్యక్తి తోట.. అతను తడిచి పోయారని ఏవియేషన్ కు ఇచ్చిన ఫిర్యాదులో అతను పేర్కొన్నాడు.

“విమానాల నుండి వదిలివేసే మురుగునీటితో ప్రతి సంవత్సరం అనేక సంఘటనలు జరుగుతాయని నాకు తెలుసు, కానీ ఇది చాలా ఎక్కువగా జరిగింది. అతని తోట అంతా చాలా అసహ్యకరమైన రీతిలో తయారైంది. అంతేకాకుండా, ఆ తోటకు సంబంధించిన రైతు ఆ సమయంలో తోటలో ఉన్నాడు. అతనిపై కూడా ఈ వ్యర్ధాలు పడటం నిజంగా భయంకరమైన అనుభవం అని కరెన్ డేవిస్ చెప్పారు.”

విమానాల్లో మురుగునీరు, టాయిలెట్ వ్యర్థాలను సాధారణంగా ప్రత్యేక ట్యాంకుల్లో సేకరించి విమానం ల్యాండ్ అయిన తర్వాత పారవేస్తారు. కానీ, ఈ విమానం గాలిలో ఉండగానే ఆ పని చేయడంతో ఇలా జరిగింది. గతంలో కూడా ఇలా ఒకసారి జరిగింది. 2018లో ఒక విమానం నుంచి మానవ వ్యర్ధాలు ఒక ఇంటిపై పడ్డాయి. గట్టిగా ఉన్న ఆ వ్యర్ధాలు నేరుగా ఇంటి పై నుంచి అక్కడ ఉన్న ఒక వ్యక్తిపై పడటంతో ఆ వ్యక్తి ఆసుపత్రి పాలయ్యాడు. త్రుటిలో ప్రాణాపాయం నుంచి గట్టేక్కాడు. ఇటువంటి సంఘటనలు ఎప్పుడో కానీ జరగవు. తాజాగా జరిగిన సంఘటనలో వ్యర్ధాలు పూర్తిగా పలుచగా ఉండటంతో తోట అంతా పడ్డాయి. వేడి వాతావరణం కారణంగా మానవ వ్యర్ధాలు పలుచగా అయిపోయి ఉంటాయని భావిస్తున్నారు. అందుకే తోటతో పాటు రైతుపై కూడా వ్యర్ధాలు పడి ఉండవచ్చని స్థానికులు అంటున్నారు.

న్యూస్‌వీక్ ప్రకారం, ఈ ఘటనకు బాధ్యులైన ఎయిర్‌లైన్ పేరు వెల్లడించలేదు. అయితే, అనూహ్యంగా మురికినీరు డంపింగ్‌కు గురైన వ్యక్తి విమానయాన సంస్థపై బీమా క్లెయిమ్‌ను కొనసాగించకూడదని నిర్ణయించుకోవడం విశేషం.

ఆ వ్యక్తి ఎయిర్‌లైన్‌ని సంప్రదించాడని, మొదట దాని విమానం ఆ ప్రాంతంలో లేదని ఆ ఎయిర్ లైన్స్ సంస్థ చెప్పింది. అయితే, రూట్ ట్రాకింగ్ యాప్ ద్వారా ఆ వ్యక్తి విమానాన్ని గుర్తించిన తర్వాత ఎయిర్లైన్స్ చివరికి ఈ సంఘటనను అంగీకరించింది.

ఇవి కూడా చదవండి: Multibagger Stock Tips: ఏడాదిలో కళ్లు చెదిరే లాభాలు.. ఈ షేర్లు మాములుగా లేవుగా.. పెట్టుబడిదారులకు డబ్బులే డబ్బులు!

Car Safety Features: కారు భద్రతకు ఈ ఫీచర్లు ఎంతో అవసరం.. మీ కారులో ఇవి ఉన్నాయా మరి..!

Petrol Diesel Price: దేశ వ్యాప్తంగా మరోసారి పెరిగిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..

Click on your DTH Provider to Add TV9 Telugu