పెళ్లికి వెళ్లిన దంపతులకు అద్భుత బిజినెస్ ఆఫర్ ఇచ్చిన చుట్టం..! కానీ, పాపం అడ్డంగా బుక్కయ్యారు!!
అనపర్తికి చెందిన సత్య నాగమల్లేశ్వర రెడ్డి, వనజ భార్యభర్తలు. వీళ్లు గత రెండేళ్లుగా పార్వతీపురంలోనే నివాసం ఉంటున్నారు. సత్య నాగమల్లేశ్వర రెడ్డి స్థానిక పెట్రోల్ బంక్లో పని చేస్తున్నారు. కాగా, మే 11న వీరు తమ బంధువుల పెళ్లికి స్వగ్రామానికి వెళ్లారు.
నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న దంపతులను పార్వతీపురం జిల్లా కొమరాడ పోలీసులు అరెస్టు చేశారు. దుకాణదారులు ఇచ్చిన పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కిలాడీ జంటను అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై ప్రయోగమూర్తి తెలిపిన వివరాల ప్రకారం…
తూర్పు గోదావరి జిల్లా అనపర్తికి చెందిన సత్య నాగమల్లేశ్వర రెడ్డి, వనజ భార్యభర్తలు. వీళ్లు గత రెండేళ్లుగా పార్వతీపురంలోనే నివాసం ఉంటున్నారు. సత్య నాగమల్లేశ్వర రెడ్డి స్థానిక పెట్రోల్ బంక్లో పని చేస్తున్నారు. కాగా, మే 11న వీరు తమ బంధువుల పెళ్లికి స్వగ్రామానికి వెళ్లారు. అక్కడ బంధువు అనిల్ రెడ్డి నకిలీ నోట్ల విషయాన్ని సత్యనాగమల్లేశ్వర రెడ్డికి తెలియజేశాడు. కష్టపడకుండా డబ్బు సంపాదించాలన్న దురాశతో అనిల్ వద్ద సత్యనాగమల్లేశ్వర రెడ్డి రూ.10 వేల అసలు నోట్లకు.. రూ.20 వేల నకిలీ నోట్లు తీసుకున్నారు. వాటిని కొమరాడలో పెట్రోల్ బంకులో రూ. 200 నకిలీ నోటు ఇచ్చి పెట్రోల్ కొట్టించుకున్నారు. కాసేపటికి అది నకిలీ నోటు అని గుర్తించిన పెట్రోల్ బంక్ సిబ్బంది.. పార్వతీపురం పాత బస్టాండు వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన పోలీసులు భార్యభర్తలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.19 వందల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు ఇంతకు ముందే పెద్ద ఎత్తున నకిలీ నోట్లను మార్కెట్లో చెలామణి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నకిలీ నోట్ల ముఠాను పట్టుకునేందుకు తూర్పుగోదావరి జిల్లాకు ప్రత్యేక బృందాన్ని పంపామని ఎస్సై ప్రయోగ మూర్తి తెలిపారు.