AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో కొత్త పింఛన్లపై ప్రభుత్వం కీలక అప్డేట్.. అర్హులైనవారికి సూపర్ ఛాన్స్.. ఇది మిస్ కావొద్దు..

ఏపీలో పించన్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. దరఖాస్తు గడువును మరింత పొడిగించింది. 16వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుండగా.. మరో రెండు రోజులు పొడిగించింది. ఈ మేరకు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు కీలక ప్రకటన చేశారు. ప్రజలు దీనిని గమనించాలని కోరారు.

Andhra Pradesh: ఏపీలో కొత్త పింఛన్లపై ప్రభుత్వం కీలక అప్డేట్.. అర్హులైనవారికి సూపర్ ఛాన్స్.. ఇది మిస్ కావొద్దు..
Pensions
Venkatrao Lella
|

Updated on: Sep 16, 2026 | 9:43 AM

Share

ఏపీలో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేవారికి కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల కోసం దరఖాస్తు గడువును మరింత పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అధికారికంగా ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పించన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు మరో రెండు రోజులు గడువు పెంచినట్లు స్పష్టం చేశారు. దీంతో సెప్టెంబర్‌ 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించేందుకే మరో రెండు రోజులు గడువు పెంచినట్లు కొండపల్లి శ్రీనివాస్‌ క్లారిటీ ఇచ్చారు. సెప్టెంబర్‌ 7 తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలవ్వగా.. ఈ నెల 16 వరకు సమయం ఇచ్చారు. అయితే ఇప్పుడు 18వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సహా అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని కొండపల్లి శ్రీనివాసరావు సూచించారు. స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఈ-కేవైసీకి పూర్తి ఏర్పాట్లు ప్రభుత్వం చేసిందని చెప్పారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు నమోదు అనంతరం అక్నాలెడ్జ్‌మెంట్‌ పత్రం అందిస్తారని, అది తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్టీఆర్‌ భరోసా ద్వారా 62 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నామని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ గడువు పొడిగింపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అర్హులైన ప్రతీఒక్కరికీ పింఛణ్లు అందిస్తామని, దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అర్హతలు ఉంటే పించన్ మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. పించన్ల మంజూరులో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా ప్రక్రియ చేపడతామని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. అర్హులైన ప్రతీఒక్కరికీ పించన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.

త్వరలోనే పించన్లు మంజూరు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా సామాజిక పించన్లను పంపిణీ చేస్తోంది. వృద్దులు, వితంతువులకు రూ.4 వేలకు పెంచగా.. దివ్యాంగులు, వికలాంగులకు రూ.6 వేలు అందిస్తోంది. ప్రతీ నెలా ఒకటో తేదీన వీటిని నేరుగా ఇంటికెళ్లి పంపిణీ చేస్తోంది. ఒకటో తేేదీ సెలవు వస్తే.. ముందు రోజే లబ్దిదారులకు అందిస్తోంది. ఒకరోజు పింఛన్ అందించే సమయానికి ఇంట్లో లేకపోతే గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి తీసుకోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా కొత్త పించన్ల మంజూరు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Follow Us