APPSC Group 1 Notification 2026: 163 డిప్యూటీ కలెక్టర్, DSP, DEO 16 సర్వీసుల్లో ఉద్యోగాలు..
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 సర్వీసుల భర్తీకి 163 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్యూటీ కలెక్టర్, డీఎస్‌పీ, డీఈఓ, ఆర్‌టీఓ, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్ట్రార్ తదితర పోస్టులు ఇందులో ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 6 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది..

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 సర్వీసుల కింద వివిధ కేటగిరీల పోస్టుల భర్తీకి 163 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అక్టోబర్ 6, 2026 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకాల్లో సివిల్ సర్వీసెస్‌లో డిప్యూటీ కలెక్టర్, పోలీస్ సర్వీసెస్‌లో డీఎస్‌పీ, ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌లో డీఈఓ, ట్రైబల్ వెల్ఫేర్, స్టేట్ ఆడిట్ సర్వీస్ తదితర 13 ఏపీ సర్వీసులకు చెందిన పోస్టులు ఉన్నాయి.
సర్వీస్ వారీగా పోస్టుల వివరాలు..
- ఏపీ సివిల్ సర్వీస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) లో డిప్యూటీ కలెక్టర్ పోస్టుల సంఖ్య: 11
- ఏపీ స్టేట్ టాక్స్ సర్వీస్‌లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ పోస్టుల సంఖ్య: 14
- ఏపీ పోలీస్ సర్వీస్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సివిల్) కేటగిరీ-II పోస్టుల సంఖ్య: 36
- ఏపీ పోలీస్ సర్వీస్‌లో డిఎస్పీ (కమ్యూనికేషన్స్) పోస్టుల సంఖ్య: 3
- ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీస్‌లో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 14
- ఏపీ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్‌లో రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 3
- ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్‌లో డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 1
- ఏపీ కోఆపరేటివ్ సర్వీస్‌లో డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టుల సంఖ్య: 15
- ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్‌లో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-II పోస్టుల సంఖ్య: 12
- ఏపీ ట్రెజరీ & అకౌంట్స్ సర్వీస్‌లో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ / అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 2
- ఏపీ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ సర్వీస్‌లో డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 3
- ఏపీ స్టేట్ ఆడిట్ సర్వీస్‌లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 14
- ఏపీ పంచాయతీ రాజ్ సర్వీస్‌లో డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 35
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. అయితే కొన్ని ప్రత్యేక పోస్టులకు నిర్దిష్ట విద్యార్హతలు అవసరం. డీఎస్‌పీ (కమ్యూనికేషన్స్) పోస్టుకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ లేదా రేడియో ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు అక్టోబర్ 6, 2026 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. మూడు దశల్లో ఎంపిక ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. మొత్తం 825 మార్కులకు ఈ ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పోస్టును బట్టి అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం లభించనుంది.
డిప్యూటీ కలెక్టర్, అసిస్టెంట్ కమిషనర్, డీఎస్‌పీ, డీఈఓ పోస్టులకు నెలకు: రూ.61,960 నుంచి రూ.1,51,370 వరకు ఆర్‌టీఓ, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్ట్రార్ తదితర పోస్టులకు నెలకు: రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టుకు నెలకు: రూ.65,360 నుంచి రూ.1,54,980 వరకు ఇతర పోస్టులకు నెలకు: రూ.54,060 నుంచి రూ.1,40,540 వరకు
ప్రిలిమినరీ పరీక్ష విధానం
స్క్రీనింగ్ టెస్ట్ ఆఫ్‌లైన్‌లో OMR ఆధారిత ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో జనరల్ స్టడీస్ 120 మార్కులకు, పేపర్ 2 జనరల్ ఆప్టిట్యూడ్ 120 మార్కులు ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు కోత విధిస్తారు.
మెయిన్స్ పరీక్ష
మెయిన్స్ పరీక్ష డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో రెండు క్వాలిఫైయింగ్ లాంగ్వేజ్ పేపర్లు, తెలుగు, ఇంగ్లిష్, అలాగే ఐదు జనరల్ కోర్ పేపర్లు ఉంటాయి. ప్రతి జనరల్ కోర్ పేపర్ 150 మార్కులకు ఉంటుంది. మెయిన్స్ అనంతరం నిర్వహించే ఇంటర్వ్యూకు 75 మార్కులు కేటాయించారు.
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




