గోడ రంధ్రంలో ఇరుక్కున్న నాగుపాము.. వైద్యం చేసి కాపాడిన స్నేక్ క్యాచర్.. ఎక్కడంటే.!

సాధారణంగా పాములను ఆమడదూరం నుంచి చూస్తే చాలు పరుగుపెడతాం. అలాంటిది ఓ వ్యక్తి పాముకి వైద్యం చేసి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు..

గోడ రంధ్రంలో ఇరుక్కున్న నాగుపాము.. వైద్యం చేసి కాపాడిన స్నేక్ క్యాచర్.. ఎక్కడంటే.!
Snake
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 18, 2021 | 1:53 PM

సాధారణంగా పాములను ఆమడదూరం నుంచి చూస్తే చాలు పరుగుపెడతాం. అలాంటిది ఓ వ్యక్తి పాముకి వైద్యం చేసి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు.. మన ఏపీలోనే చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నాగుపాము కలకలం సృష్టించింది. స్థానికంగా ఉన్న శ్రీ వేంకటేశ్వర జనరల్ మార్కెట్‌లోని ఓ షాపు గోడౌన్‌లో నాగుపాము ప్రత్యక్షం కావడంతో జనాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అనూహ్యంగా ఆ పాము బయటికి వెళ్లే క్రమంలో గోడ రంధ్రంలో ఇరుక్కుపోయింది. రెండు రోజులుగా అలాగే ఉండిపోయి.. అవస్థలు పడింది. దీనితో అక్కడ ఉండే కొంతమంది స్థానికులు స్నేక్ క్యాచర్‌కు సమాచారాన్ని అందించారు.

అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ విక్రమ్ జైన్.. గోడను తవ్వి పామును రక్షించాడు. అనంతరం లాలాచెరువు అటవీప్రాంతంలోకి తీసుకెళ్లి విడిచిపెట్టాడు. వెటర్నరీ డాక్టర్ సూచనల మేరకు స్నేక్ క్యాచర్ విక్రమ్ జైన్ పాముకి ఆయింట్ మెంట్ రాసి చాకచక్యంగా వైద్యం చేశాడు. కాగా, పాము క్షేమంగా ఓ పుట్టలోకి వెళ్లిపోవడంతో జనాలు ఊపీరి పీల్చుకున్నారు.

Snake 1