AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు చురుకుగా ఏర్పాట్లు.. నిర్భయంగా ఓటు వేయాలన్న ఎస్ఈసీ..!

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్‌ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. రెండు రోజుల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది.

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు చురుకుగా ఏర్పాట్లు.. నిర్భయంగా ఓటు వేయాలన్న ఎస్ఈసీ..!
Balaraju Goud
|

Updated on: Feb 28, 2021 | 1:57 PM

Share

AP Municipal polls 2021 : ఆంధ్రప్రదేశ్ మున్సిపల్‌ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. రెండు రోజుల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. మార్చి 10న రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఏర్పాట్లను ఎన్నికల సంఘం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కృష్ణా,గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల అధికారులతో సమావేశమయ్యారు. కార్పొరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికలపై వారికి దిశా నిర్దేశం చేశారు.

ఏపీలో 75 మున్సిపాల్టీలు, 12 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 10న ఎన్నికలు, 14న కౌంటింగ్‌కు ఇప్పటికే నిర్ణయించారు. మార్చి 2న నామినేషన్ల ఉపసంహరణ గడువు విధించారు. మార్చి 3న నామినేషన్ల పరిశీలన. మార్చి 4న తుది అభ్యర్థులను ప్రకటిస్తారు. అధికారులతో మీటింగ్‌ అనంతరం సాయంత్రం ఆరు గంటలకు రాజకీయ పార్టీలతో నిమ్మగడ్డ సమావేశం కాబోతున్నారు.

మరోవైపు, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లను విచారించిన హైకోర్టు.. ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోలేం అని స్పష్టం చేసింది. దీంతో ఈ నెల 10వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. వరుస క్షేత్రస్థాయి పర్యటిస్తూ వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా శనివారం తిరుపతిలో ఆయన పర్యటించారు..

తొలి పర్యటనలో ఆయన సంచలన నిర్ణయాలను ప్రకటించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోను వాలంటీర్ల వినియోగం ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు పూర్తైన వరకు వాలంటీర్ల కదలికలపై దృష్టి పెడతామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వాలంటీర్ల పాత్రలపై పలు అనుమానాలు తలెత్తాయి. విపక్ష పార్టీలన్నీ వాలంటీర్లే దగ్గరుండి అధికారపక్షానికి సహకరించారని.. ఫిర్యాదులు చేశాయి. ఈ నేపథ్యంలో దీనిపై ఎస్ఈసీ క్లారిటీ ఇచ్చారు.

ఇదిలావుంటే, మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి ఐదుకు మించి సభ్యులు ఉండకూడదని నిబంధన విధించారు. అటు ప్రతి కార్పొరేటర్ అభ్యర్థి ప్రచారంలో 50కి పైగా అనుచరులు పాల్గొంటున్నారు. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం ఆర్భాటంగా ఎన్నికల ప్రచారం చేసేవారిపై కేసులు పెడతమంటున్నారు. ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు తప్పకపాటించాల్సిందే అంటుపన్నారు.

ఎన్నికల్లో మద్యం, డబ్బుల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎస్ఈసీ అన్నారు. చెక్ పోస్టుల దగ్గర పోలీసుల తనిఖీలు నిరంతరం కొనసాగుతున్నాయన్నారు. పోలీస్టేషన్ కు వందకిలోమీటర్ల దూరంలో ప్రచారం చేయకూడదని నిమ్మగడ్డ స్పష్టం చేశారు. అలాగే, ఒత్తిడికిలోనై, భయబ్రాంతులకు గురై నామినేషన్లు విత్ డ్రా చేసుకుంటున్నామని ముందుకు వచ్చి ఎవరైతే ఫిర్యాదు చేస్తారో వారికి ఎన్నికల కమిషనర్ తరపున కచ్చితంగా భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయినా నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారని ఎవరైనా ఆధారాలను చూపిస్తే పునఃపరిశీలిస్తామన్నారు.

ఈ సోమవారం వరకు అన్ని రాజకీయ పార్టీల నేతల ఫిర్యాదులను స్వీకరిస్తామని ఎస్ఈసీ వెల్లడించారు. పంచాయతీ ఎన్నికలు చక్కటి వాతావరణంలో జరిగాయన్నారు. అందుకే పోలింగ్ శాతంగా భారీగా పెరిగిందన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలు కూడా సజావుగా జరుగుతాయని ఎస్ఈసీ ఆశాభావం వ్యక్తం చేశారు. భారీగా పోలింగ్ నమోదు కాావాలని ఆశిస్తున్నాను అన్నారు. Read Also.. తెలంగాణలో మరోసారి పెరగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 176 మందికి పాజిటివ్, ఒకరు మృతి