AP Municipal Results: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఫలితాల్లో వైసీపీ జోరు.. మైదుకూరు, తాడిపత్రిలో టీడీపీ హవా

AP Municipal Elections Results: ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తైంది. అయితే, పట్టణవాసులు ఇచ్చిన తీర్పు పూర్తిగా ఏకపక్షంగా సాగింది.

AP Municipal Results: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఫలితాల్లో వైసీపీ జోరు.. మైదుకూరు, తాడిపత్రిలో టీడీపీ హవా
Ap Municipal Elections Results 2021 Counting Updates
Follow us

|

Updated on: Mar 14, 2021 | 4:35 PM

AP Municipal elections results : ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తైంది. అయితే, పట్టణవాసులు ఇచ్చిన తీర్పు పూర్తిగా ఏకపక్షంగా సాగింది. ఆది నుంచి చివరి దాకా ఫ్యాన్ గాలి కొనసాగింది. ఆడా ఈడా కాదు… అన్నింటా మనమే.. అన్నిచోట్ల మనమే అన్నట్లు సాగింది. మున్సిపల్‌ ఎన్నికల్లో తిరుగులేని రికార్డు సాధించి విపక్షాల జాడ కనపడకుండా చేసింది అధికారపార్టీ. పంచాయితీ ఎన్నికల్లోనూ మెజార్టీ దక్కించుకున్నా.. గుర్తులు లేకపోవడంతో సాధికారికంగా చెప్పలేకపోయిన పార్టీ.. తాజా ఫలితాలతో ప్రతిపక్షాలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది.

మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 13జిల్లాల్లో జరిగిన పురపోరులో 11 కార్పొరేషన్లు…71మున్సిపాలిటీలకు 10న ఎన్నికలు జరిగాయి. అయితే ఇందులో పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు కార్పొరేషన్‌తో పాటు గుంటూరు జిల్లా చిలకలూరిపేట మున్సిపాలిటీ ఫలితాలను మాత్రం హైకోర్టు ప్రకటించవద్దని ఆదేశించింది. దీంతో మిగిలిన 11 కార్పొరేషన్‌లు, 70మున్సిపాలిటీల ఫలితాలు వెలవడ్డాయి. కార్పొరేషన్‌ల విషయానికి వచ్చేసరికే…గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, మచిలీపట్నం, ఒంగోలు, కర్నూలు, కడప, చిత్తూరు, తిరుపతి, అనంతపురం , విజయనగరం కార్పొరేషన్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

మున్సిపల్ ఎన్నికల్లో 99 శాతం వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో టీడీపీతో ప్రతిపక్ష పార్టీలన్ని తుడిచిపెట్టుకుపోయాయి. మొత్తం 70 మున్సిపల్ స్థానాలకు గానూ అధికార వైఎస్సార్‌సీపీ 68 మున్సిపాలిటీల్లో ఘన విజయం సాధించి పట్టప్రాంతాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగింది.అయితే కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలో హోరాహోరీ నెలకొంది. ఇక్కడ మొత్తం 24 వార్డులుండగా… టీడీపీదే పైచేయి అయింది. టీడీపీకి 12, వైసీపీకి 11, జనసేనకు ఒక వార్డు దక్కాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలోనూ టీడీపీ, వైసీపీ మధ్య నువ్వానేనా అన్నట్టు సాగుతోంది. ఇక్కడ మొత్తం 36 వార్డులు ఉండగా, ఏకగ్రీవాలు అన్నీ కలుపుకుని వైసీపీ 12 చోట్ల విజయం సాధించగా, టీడీపీ 20 స్థానాల్లో నెగ్గింది. సీపీఐ 1, జనసేన 1, ఇండిపెండెంట్ అభ్యర్థికి ఒక స్థానం దక్కాయి. తాడిపత్రిలో 24వ వార్డు అభ్యర్థిగా బరిలో దిగిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి గెలుపొందడంతో పార్టీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి.

ఇక, మొత్తం 11 కార్పొరేషన్లకు గానూ విశాఖపట్నం, తిరుపతి, చిత్తూరు, గుంటూరు, కర్నూలు, ఒంగోలు, కడప, మచిలీపట్నం, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లు వైసీపీ ఖాతాలో చేరాయి. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించి ఫలితాన్ని హైకోర్టు ఆదేశాలతో ఫలితాన్ని ఎన్నికల అధికారులు రిజర్వ్‌లో ఉంచారు.

11 మున్సిపల్ కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఓట్లను లెక్కిస్తున్నారు. ఫలితాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి..

ఏపీ మునిసిపాలిటీ ఎన్నికల ఫలితాలు
S.No మునిసిపాలిటీ విజయం 
1 ఇచ్ఛాపురం వైఎస్ఆర్‌సీపీ
2 పలాస-కాశీబుగ్గ వైఎస్ఆర్‌సీపీ
3 పాలకొండ వైఎస్ఆర్‌సీపీ
4 బొబ్బిలి వైఎస్ఆర్‌సీపీ
5 పార్వతీపురం వైఎస్ఆర్‌సీపీ
6 సాలూరు వైఎస్ఆర్‌సీపీ
7 నెల్లిమర్ల వైఎస్ఆర్‌సీపీ
8 నర్సీపట్నం వైఎస్ఆర్‌సీపీ
9 యలమంచిలి వైఎస్ఆర్‌సీపీ
10 అమలాపురం వైఎస్ఆర్‌సీపీ
11 తుని వైఎస్ఆర్‌సీపీ
12 పిఠాపురం వైఎస్ఆర్‌సీపీ
13 సామర్లకోట వైఎస్ఆర్‌సీపీ
14 మండపేట వైఎస్ఆర్‌సీపీ
15 రామచంద్రాపురం వైఎస్ఆర్‌సీపీ
16 పెద్దాపురం వైఎస్ఆర్‌సీపీ
17 ఏలేశ్వరం వైఎస్ఆర్‌సీపీ
18 గొల్లప్రోలు వైఎస్ఆర్‌సీపీ
19 ముమ్మిడివరం వైఎస్ఆర్‌సీపీ
20 నర్సాపురం వైఎస్ఆర్‌సీపీ
21 నిడదవోలు వైఎస్ఆర్‌సీపీ
22 కొవ్వూరు వైఎస్ఆర్‌సీపీ
23 జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్‌సీపీ
24 నూజివీడు వైఎస్ఆర్‌సీపీ
25 పెడన వైఎస్ఆర్‌సీపీ
26 ఉయ్యూరు వైఎస్ఆర్‌సీపీ
27 నందిగామ వైఎస్ఆర్‌సీపీ
28 తిరువూరు వైఎస్ఆర్‌సీపీ
29 తెనాలి వైఎస్ఆర్‌సీపీ
30 చిలకలూరిపేట  పెండింగ్
31 రేపల్లె వైఎస్ఆర్‌సీపీ
32 మాచర్ల వైఎస్ఆర్‌సీపీ
33 సత్తెనపల్లి వైఎస్ఆర్‌సీపీ
34 వినుకొండ వైఎస్ఆర్‌సీపీ
35 పిడుగురాళ్ల వైఎస్ఆర్‌సీపీ
36 చీరాల వైఎస్ఆర్‌సీపీ
37 మార్కాపురం వైఎస్ఆర్‌సీపీ
38 అద్దంకి వైఎస్ఆర్‌సీపీ
39 చీమకుర్తి వైఎస్ఆర్‌సీపీ
40 కనిగిరి వైఎస్ఆర్‌సీపీ
41 గిద్దలూరు వైఎస్ఆర్‌సీపీ
42 వెంకటగిరి వైఎస్ఆర్‌సీపీ
43 ఆత్మకూరు(N) వైఎస్ఆర్‌సీపీ
44 సూళ్లూరుపేట వైఎస్ఆర్‌సీపీ
45 నాయుడుపేట వైఎస్ఆర్‌సీపీ
46 హిందూపురం వైఎస్ఆర్‌సీపీ
47 గుంతకల్లు వైఎస్ఆర్‌సీపీ
48 తాడిపత్రి టీడీపీ
49 ధర్మవరం వైఎస్ఆర్‌సీపీ
50 కదిరి వైఎస్ఆర్‌సీపీ
51 రాయదుర్గం వైఎస్ఆర్‌సీపీ
52 గుత్తి వైఎస్ఆర్‌సీపీ
53 కళ్యాణదుర్గం వైఎస్ఆర్‌సీపీ
54 పుట్టపర్తి వైఎస్ఆర్‌సీపీ
55 మడకశిర వైఎస్ఆర్‌సీపీ
56 ఆదోని వైఎస్ఆర్‌సీపీ
57 నంద్యాల వైఎస్ఆర్‌సీపీ
58 ఎమ్మిగనూరు వైఎస్ఆర్‌సీపీ
59 డోన్ వైఎస్ఆర్‌సీపీ
60 ఆళ్లగడ్డ వైఎస్ఆర్‌సీపీ
61 నందికొట్కూరు వైఎస్ఆర్‌సీపీ
62 గూడూరు(K) వైఎస్ఆర్‌సీపీ
63 ఆత్మకూరు(K) వైఎస్ఆర్‌సీపీ
64 ప్రొద్దుటూరు వైఎస్ఆర్‌సీపీ
65 పులివెందుల వైఎస్ఆర్‌సీపీ
66 జమ్మలమడుగు వైఎస్ఆర్‌సీపీ
67 బద్వేల్ వైఎస్ఆర్‌సీపీ
68 రాయచోటి వైఎస్ఆర్‌సీపీ
69 మైదుకూరు టీడీపీ
70 ఎర్రగుంట్ల వైఎస్ఆర్‌సీపీ
71 మదనపల్లె వైఎస్ఆర్‌సీపీ
72 పుంగనూరు వైఎస్ఆర్‌సీపీ
73 పలమనేరు వైఎస్ఆర్‌సీపీ
74 నగరి వైఎస్ఆర్‌సీపీ
75 పుత్తూరు వైఎస్ఆర్‌సీపీ

తేజా సజ్జా 'మిరాయ్' గ్లింప్స్ చూస్తే గూస్ బంప్సే..
తేజా సజ్జా 'మిరాయ్' గ్లింప్స్ చూస్తే గూస్ బంప్సే..
జాట్ల గడ్డపై సమరం.. జయంత్ చౌదరికి అగ్నిపరీక్షగా తొలి విడత పోలింగ్
జాట్ల గడ్డపై సమరం.. జయంత్ చౌదరికి అగ్నిపరీక్షగా తొలి విడత పోలింగ్
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
ఓపెనర్లుగా కోహ్లీ, రోహిత్.. బ్యాకప్‌గా సచిన్ 2.0..
ఓపెనర్లుగా కోహ్లీ, రోహిత్.. బ్యాకప్‌గా సచిన్ 2.0..
ఊపిరితిత్తులను శుభ్రంగా, ఆరోగ్యం ఉంచే ఆహారాలు ఇవే
ఊపిరితిత్తులను శుభ్రంగా, ఆరోగ్యం ఉంచే ఆహారాలు ఇవే
ఓయ్ చూసుకోబడలే.! బికినీలో బస్సెక్కేసిన మహిళ.. ఈ బామ్మ రియాక్షన్!
ఓయ్ చూసుకోబడలే.! బికినీలో బస్సెక్కేసిన మహిళ.. ఈ బామ్మ రియాక్షన్!
నీటిలో కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటని వెళ్లి చూడగా దిమ్మతిరిగింది
నీటిలో కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటని వెళ్లి చూడగా దిమ్మతిరిగింది
అలాంటి వస్త్రాలు ధరించినందుకు క్లాస్ రూంకు అనుమతి నిరాకరణ..
అలాంటి వస్త్రాలు ధరించినందుకు క్లాస్ రూంకు అనుమతి నిరాకరణ..
అందుకే వేసవిలో కొబ్బరి బోండం నీళ్లు తాగాలట.. ఎన్ని లాభాలో!
అందుకే వేసవిలో కొబ్బరి బోండం నీళ్లు తాగాలట.. ఎన్ని లాభాలో!
అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్..
అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్..
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..