ఏపీలో మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు ప్రారంభం.. మరికొద్దిసేపట్లో తొలి ఫలితం.. తీవ్ర ఉత్కంఠలో అభ్యర్థులు

ఏపీలో ఉత్కంఠను రేపుతున్న మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మరికొద్ది సేపట్లో తొలి ఫలితం తేలిపోనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు..

ఏపీలో మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు ప్రారంభం.. మరికొద్దిసేపట్లో తొలి ఫలితం.. తీవ్ర ఉత్కంఠలో అభ్యర్థులు
Municipal Counting Start
Follow us

| Edited By: Team Veegam

Updated on: Mar 14, 2021 | 10:48 AM

AP Municipal Elections  2021 results: ఏపీలో ఉత్కంఠను రేపుతున్న మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మరికొద్ది సేపట్లో తొలి ఫలితం తేలిపోనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. 10 గంటల వరకు తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది. సాయంత్రం వరకు అన్ని చోట్ల ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే విశాఖలో డివిజన్లు ఎక్కువగా ఉండడంతో తుది ఫలితం వెలువడే వరకు ఆలస్యమవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇక హైకోర్టు ఆదేశాలతో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఓట్ల లెక్కింపును తాత్కాలికంగా నిలిపివేశారు.

రాష్ట్రంలో 12 నగరపాలక సంస్థల్లో 28,61,550 ఓట్లు పోలయ్యాయి. ఏలూరులో కౌంటింగ్‌ తాత్కాలికంగా నిలిపివేయగా.. 11 చోట్ల 27,29,072 ఓట్లను ఎన్నికల సిబ్బంది లెక్కించనున్నారు. ఇందు కోసం 4,026 టేబుళ్లను ఏర్పాటు చేసి 12,607 మంది సిబ్బందిని నియమించారు. 4,317 మంది అధికారులు కౌంటింగ్‌ను పర్యవేక్షించనున్నారు.

ఎన్నికలు జరిగిన 12 నగర పాలక సంస్థల్లోని 671 డివిజన్లలో 91 ఏకగ్రీవమయ్యాయి. దాంతో 580 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించారు. వాటిలో ఏలూరులో ఎన్నికలు నిర్వహించిన 47 డివిజన్లలో ఓట్ల లెక్కింపు ప్రస్తుతం చేపట్టడం లేదు. మిగిలిన 533 డివిజన్లలో పోలైన ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

రాష్ట్రంలో 71 పురపాలక సంఘాలు / నగర పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ చేపట్టారు. వాటిలో పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాల్లో అన్ని డివిజన్లు (మొత్తం 128) ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో కూడా 362 డివిజన్లు, వార్డులు ఏకగ్రీవమవడంతో మొత్తం ఏకగ్రీవ డివిజన్లు, వార్డుల సంఖ్య 490కు చేరింది. దాంతో ఎన్నికలు నిర్వహించిన మిగిలిన 1,633 డివిజన్లు, వార్డుల్లో పోలైన ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

కౌటింగ్‌లో భాగంగా మొదట పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 172 మంది డీఎస్పీలు, 476 మంది సీఐలు, 1,345 మంది ఎస్‌ఐలు, 17,292 మంది కానిస్టేబుళ్లు, మరో 1,134 మంది ఇతర భద్రత సిబ్బంది మోహరించారు. ఇప్పటికే కౌంటింగ్‌ కేంద్రాల పరిధిలో అధికారులు 144 సెక్షన్‌ విధించారు. ఇదిలా ఉండగా.. రాత్రి 8గంటల్లోగా కౌంటింగ్‌ ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల కమిషనర్‌ ఆదేశించారు.

ఓట్ల లెక్కింపు మొత్తాన్ని వీడియో తీయించి ఫుటేజీని భద్రపరచాలని, లెక్కింపును వెబ్‌కాస్టింగ్‌ చేయాలని ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

Read More: పులివెందులకు షర్మిల.. చిన్నాన్న వివేకానందరెడ్డి వర్థంతికి హాజరు.. జగన్‌తో షర్మిల భేటీపై ఆసక్తి

AP Municipal Election Results 2021 LIVE: కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. ఏపీ పురపాలికల్లో వైసీపీదే హవా..

Visakhapatnam Counting : ఆసక్తికరంగా మారిన విశాఖ కార్పొరేషన్ కౌంటింగ్, కొత్త రాజధాని, విశాఖ ఉక్కు నేపథ్యంలో అందరి దృష్టి

తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.
అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..