Visakhapatnam Counting : ఆసక్తికరంగా మారిన విశాఖ కార్పొరేషన్ కౌంటింగ్, కొత్త రాజధాని, విశాఖ ఉక్కు నేపథ్యంలో అందరి దృష్టి
Visakhapatnam Municipal Corporation Counting : ఏపీలో ఎన్నికలు జరిగిన అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఫలితాలు వస్తున్న వేళ, విశాఖ..
AP Municipal Elections Results : ఏపీలో ఎన్నికలు జరిగిన అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఫలితాలు వస్తున్న వేళ, విశాఖ కార్పొరేషన్ కౌంటింగ్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొత్త రాజధాని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నేపథ్యంలో విశాఖ ఎన్నికలు జరగడంతో ఫలితాలపై అందరి దృష్టి నిలిచింది. కాగా, విశాఖలో మొత్తం 98 డివిజన్లకు కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. కార్యనిర్వాహక రాజధాని నినాదంతో వైసీపీ ఎన్నికలకు వెళ్తే, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ టీడీపీ ప్రచారాన్ని రక్తికట్టించే ప్రయత్నం చేసింది. ఇక మత మార్పిడిలు, దేవాలయాలపై దాడులు అంశంతో బీజేపీ ప్రచారం చేసుకుంది. విశాఖ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 8 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. మరిక సాగరనగర ప్రజలు ఎవరికి ఓటు వేశారో ఎవర్ని మేయర్ గా ఎంపిక చేస్తారో మరికాసేపట్లోనే క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది.