AP Municipal Elections: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ సెగ.. బ్యాలెట్ బాక్సుల్లో ‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’ పత్రాలు..
Vizag Municipal Elections counting: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ సెగ తగిలిగింది.
Vizag Municipal Elections counting: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ సెగ తగిలిగింది. కొందరు ఓటర్లు ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అనే నినాదాలతో కూడిన పత్రాలను బ్యాలెట్ బాక్సుల్లో వేశారు. ఇవాళ కౌంటింగ్ సందర్భంగా బ్యాలెట్ బాక్సులను అధికారులు తెరిచి ఓట్లను లెక్కిస్తుండగా.. ఈ నినాదాలతో కూడిన పత్రాలు వెలుగు చూశాయి. వివరాల్లోకెళితే.. విశాఖపట్నం జిల్లాలోని మున్సిపాలిటీలో అధికారులు ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. అందులో భాగంగా ముందుగా పలు బ్యాలెట్ బాక్సులను అధికారులు ఓపెన్ చేసి ఓట్లను లెక్కించడం మొదలు పెట్టారు. అంతలో ఓ బ్యాలెట్ పత్రాలతో మరో పత్రాన్ని అధికారులు గుర్తించారు. ఏంటా అని పరిశీలించగా.. ఆ పత్రాలపై ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అని నినాదం రాసి ఉంది. అదే బ్యాలెట్ బాక్స్‌లో మరికొన్ని పత్రాలు ఇలాంటివే లభించాయి.