Anantapur Elections Counting: అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న కౌంటింగ్.. మధ్యాహ్నానికి ఫలితాలు..
AP Municipal Elections counting: ఫ్యాక్షన్ గడ్డ పై మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. జిల్లాలో అనంతపురం కార్పొరేషన్..
AP Municipal Elections 2021 Results: ఫ్యాక్షన్ గడ్డ పై మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. జిల్లాలో అనంతపురం కార్పొరేషన్ తో పాటు పది మున్సిపా లిటీలకు జరిగిన ఎన్నికలు జరిగాయి. మొత్తం 50 డివిజన్లు, 308 వార్డులు ఉండగా.. ఇందులో 21 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఈనేపథ్యంలో మొత్తం 337 వార్డు లు డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 1,184 మంది అభ్యర్థులు నిలిచారు. స్ట్రాంగ్ రూంలలో హై సెక్యూరిటీ మధ్య బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ సందర్భంగా ఒక్కొక్కటిగా తెరుస్తున్ నారు. ఉదయం 8 గంటలకే ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. కాగా, కౌంటింగ్ కోసం జిల్లాలోని ఒక కార్పొరేషన్, 10 మున్సిపాల్టీల్లో మొత్తం 106 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 355 టేబుల్స్ లో ఓట్ల లెక్కింపు జరగనుంది. 11 గంటల నుంచే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తంగా జిల్లా పరిధిలోని ఫలితాలు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతపురం నగర పాలక సంస్థ మాత్రం మధ్యాహ్నం 2 గంటల లోపు కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. కౌంటింగ్ త్వరగా పూర్తయ్యేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Also read: