AP Municipal Elections 2021 Results : ఏపీలో చాలాచోట్ల వైసీపీ క్లీన్‌స్వీప్.. పోస్టల్ బ్యాలెట్లతో మొదలైన ఫ్యాన్ స్పీడ్..కౌంటింగ్‌లోనూ కంటిన్యూ..
AP Municipal Elections 2021 Counting : మున్సిపల్ ఎన్నికల్లో చాలాచోట్ల వైసీపీ క్లీన్‌స్వీప్ చేస్తోంది. పోస్టల్ బ్యాలెట్లతో మొదలైన ఫ్యాన్ పార్టీ స్పీడ్
AP Municipal Elections 2021 Counting : మున్సిపల్ ఎన్నికల్లో చాలాచోట్ల వైసీపీ క్లీన్‌స్వీప్ చేస్తోంది. పోస్టల్ బ్యాలెట్లతో మొదలైన ఫ్యాన్ పార్టీ స్పీడ్..కౌంటింగ్‌లోనూ కంటిన్యూ అవుతోంది. చిత్తూరుజిల్లా పుంగనూరు, కడప జిల్లా పులివెందుల, గుంటూరుజిల్లాలోని మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలను వైసీపీ గెలుచుకుంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీలు వైసీపీ కైవసమయ్యాయి. కనిగిరి మున్సిపాలిటీలో 20కి 20వార్డులూ వైసీపీకే దక్కటంతో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సహా మిగిలిన పార్టీలకు సింగిల్ సీటు కూడా దక్కలేదు. ఇక నెల్లూరుజిల్లాలోనూ వైసీపీ జోరు సాగుతోంది.
ఇప్పటిదాకా ఉన్న సమాచారాన్ని బట్టి నాయుడుపేటలోని రెండు వార్డుల్లో వైసీపీ గెలిచింది. ఆత్మకూరులోని నాలుగు వార్డుల్లో వైసీపీ విజయం సాధించింది. తూర్పుగోదావరికొస్తే… తుని మున్సిపాలిటీ తన ఖాతాలో వేసుకుంది వైసీపీ. పశ్చిమగోదావరి జిల్లాలో కొవ్వూరు మున్సిపాలిటీలో వైసీపీ ఆధిక్యం కొనసాగుతోంది. ఇప్పటిదాకా ఉన్న ట్రెండ్స్‌ను బట్టి వైసీపీ ఆరు వార్డులు గెలుచుకుంది. కర్నూలు జిల్లా డోన్‌లో వైసీపీ తిరుగులేని విజయం సాధించిది. 32వార్డుల్లో 31 స్థానాలను వైసీపీ దక్కించుకుంది. మిగిలిన ఒక స్థానంలో సీపీఐ గెలిచినా అది వైసీపీ మద్దతుతోనే కావడం విశేషం.
కొన్ని జిల్లాల్లోనే విపక్షపార్టీల అభ్యర్థులకు కొన్ని వార్డులు దక్కుతున్నట్లు ఇప్పటిదాకా ఉన్న ట్రెండ్‌ను బట్టి తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నాలుగోవార్డులో జనసేన అభ్యర్థి అనూహ్యంగా గెలిచారు. అలాగే కొవ్వూరు 23వ వార్డులో టీడీపీ గెలిచింది.