AP Municipal Elections 2021 Results : ఫలితాల్లో వైసీపీ బోణీ, గిద్దలూరు, కనిగిరి కైవశం, ప్రకాశం జిల్లాలో వైసీపీ హవా

AP Municipal Elections 2021 Results : ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ బోణీ కొట్టింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీలను

AP Municipal Elections 2021 Results : ఫలితాల్లో వైసీపీ బోణీ, గిద్దలూరు, కనిగిరి కైవశం, ప్రకాశం జిల్లాలో వైసీపీ హవా
Follow us
Venkata Narayana

|

Updated on: Mar 14, 2021 | 10:00 AM

AP Municipal Elections 2021 Results : ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ బోణీ కొట్టింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీలను ఆపార్టీ కైవసం చేసుకుంది. ఇక ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వైసీపీ హవా కనిపిస్తోంది. గిద్దలూరులో 20 వార్డులకు గానూ 9 వార్డులు వైసీపీ కైవసం చేసుకోగా.. కనిగిరిలో 20 వార్డుల్లో వైసీపీ 10 స్థానాలు గెలుచుకుంది. పోస్టల్ బ్యాలెట్ తో పాటు సాధారణ ఓట్ల లెక్కింపు పూర్తవడంతో అధికారులు ఫలితం ప్రకటించారు. 121 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి గెలిచారు.

ఫలితాలు అనుకూలంగా రిజల్ట్ రావడంతో అధికార వైసీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అదే రకమైన ఫలితాలు తధ్యమంటున్నారు. అటు, అమరావతి తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు షురూ చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు వైసీపీ సెంట్రల్ ఆఫీసుకు చేరుకోవడంతో ఇక్కడ పండుగ వాతావరణం నెలకొంది. అటు, రాష్ట్ర వ్యాప్తంగానూ మున్సిపల్ ఫలితాల్లో వైసీపీ ముందంజలో కొనసాగుతోంది.

పోస్టల్ బ్యాలెట్లలో అధికార పార్టీ అభ్యర్థులకే మెజారిటీ వచ్చింది. కాగా, ఎన్నికలకు ముందే చాలా మున్సిపాలిటీల్లో వైసీపీ తన విజయాన్ని ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీకి 4 మున్సిపాలిటీలు ఏకగ్రీవం చేసుకోగా.. పలుచోట్ల ఏకగ్రీవాలతోనే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. మరికొన్నిచోట్ల ఫలితాలతో సంబంధం లేకుండా ఎక్స్ అఫీషియో ఓట్లతో మేయర్, మున్సిపల్ ఛైర్మన్ పీఠాలు దక్కించుకునేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంది అధికారపార్టీ.

Read also : VHP slams AIMIM : ఎంఐఎం ఉగ్రవాదుల‌ను ప్రోత్సహిస్తోందన్న వీహెచ్‌పీ, బైంసాలో హిందువుల‌ ల‌క్ష్యంగా దాడులు చేస్తున్నారని మండిపాటు

చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర