RRR: వైఎస్ జగన్‌కు కౌంటర్ వేసిన అద్నాన్ సమీ.. అదిరిపోయే రీకౌంటర్ ఇచ్చిన మంత్రులు. అసలేం జరిగిందంటే..
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోగా తెరకెక్కిన ట్రిపులార్ సినిమా ఎంతటి సంచనలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొన్నటి మొన్నటి ఈ సినిమా అంతర్జాతీయ అవార్డును అందుకొని మరోసారి దేశం దృష్టిని ఆకట్టుకుంది. అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక అవార్డు అయిన గోల్డెన్ గ్లోబ్‌ను సొంతం చేసుకున్న...

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోగా తెరకెక్కిన ట్రిపులార్ సినిమా ఎంతటి సంచనలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొన్నటి మొన్నటి ఈ సినిమా అంతర్జాతీయ అవార్డును అందుకొని మరోసారి దేశం దృష్టిని ఆకట్టుకుంది. అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక అవార్డు అయిన గోల్డెన్ గ్లోబ్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ అవార్డు దక్కించుకుంది. ఈ అరుదైన ఫీట్‌ను సాధించినందుకుగాను RRR చిత్రయూనిట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా నుంచి రాజకీయ ప్రముఖుల వరకు ట్విట్టర్ వేదికగా ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సైతం ట్రిపులార్ యూనిట్‌ను పొగుడుతూ ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు ఇదే ట్వీట్ చర్చకు దారి తీసింది. జగన్ మోహన్ రెడ్డి చేసిన ట్వీట్‌కు ప్రముఖ బాలీవుడ్ సింగ్ అద్నాన్ సమీ చేసిన కౌంటర్, దానికి ఏపీ మంత్రులు ఇచ్చిన కౌంటర్‌తో నెట్టింట ట్రెండింగ్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
ట్రిపులార్ చిత్ర బృంధాన్ని అభినందిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేస్తూ.. ‘అంతర్జాతీయ అవనిపై తెలుగు జెండాను ఎగరవేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున కీరవాణి, రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తో పాటు మిగిలిన యూనిట్‌కు నా అభినందనలు, మిమ్మల్ని చూసి మేం ఎంతో గర్వపడుతున్నాం’ అని రాసుకొచ్చారు. సీఎం చేసిన ట్వీట్‌లో తెలుగు జెండాను ఉద్దేశించి సింగర్ అద్నాన్ సమీ ట్వీట్ చేశారు. జగన్ ట్వీట్‌ను ఉటంకిస్తూ.. ‘తెలుగు జెండానా? మీ ఉద్దేశం ఇండియన్ జెండా అనా? ముందు మనం ఇండియన్స్. కాబట్టి దేశం నుంచి మీకు మీరు వేరుచేసుకోవడం మానుకోండి. ముఖ్యంగా అంతర్జాతీయంగా మనమంతా ఒక దేశం. వేర్పాటువాద ధోరణి అనేది అస్సలు మంచిది కాదు. దీన్ని 1947లో మనం చూశాం. ధన్యవాదాలు.. జై హింద్’’ అని ట్వీట్ చేశారు.



జగన్ చేసిన ట్వీట్..
The #Telugu flag is flying high! On behalf of all of #AndhraPradesh, I congratulate @mmkeeravaani, @ssrajamouli, @tarak9999, @AlwaysRamCharan and the entire team of @RRRMovie. We are incredibly proud of you! #GoldenGlobes2023 https://t.co/C5f9TogmSY
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 11, 2023
అద్నాన్ సమీ ట్వీట్..
Telugu flag? You mean INDIAN flag right? We are Indians first & so kindly stop separating yourself from the rest of the country…Especially internationally, we are one country! This ‘separatist’ attitude is highly unhealthy as we saw in 1947!!! Thank you…Jai HIND!?? https://t.co/rE7Ilmcdzb
— Adnan Sami (@AdnanSamiLive) January 11, 2023
ఇదిలా ఉంటే.. అద్నాన్ సమీ చేసిన ట్వీట్‌కు ఆంధ్రప్రదేశ్ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. అద్నాన్ చేసిన ట్వీట్‌కు స్పందించిన ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కౌంటర్ ట్వీట్ చేశాడు. ‘మా భాష, మా సంస్కృతి, మా గుర్తింపు మాకు గర్వకారణం. నేను మళ్లీ చెబుతున్నాను, మేం తెలుగు వాళ్లం. మా దేశభక్తిని ప్రశ్నించడానికి మీరు ఎవరు.? తెలుగులో ఉన్న నా గౌరవం ఒక భారతీయుడిగా నా గుర్తింపును తీసుకుపోదు’ అంటూ ట్వీట్ చేశారు.
We are proud of our language, our culture and our identity.
And I proclaim again, WE ARE TELUGU. @AdnanSamiLive, you are no one to pass judgement on our patriotism.
My pride in being Telugu does not take away from my identity as an Indian. https://t.co/Z6ldHw94hh
— Gudivada Amarnath (@gudivadaamar) January 11, 2023
ఇక అద్నాన్ సమీ చేసిన ట్వీట్‌పై మరో మంత్రి విడుదల రజని కూడా స్పందించారు. ట్విట్టర్ వేదికగా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ‘ఒకరి సొంత గుర్తింపులో గర్వపడటం వారి దేశ భక్తిని తగ్గిచందు. ఒకరి మూలాన్ని గౌరవించడం వేర్పాటు వాదాన్ని ప్రకటించడం కాదు. రెండింటినీ కన్ఫ్యూజ్ చేయకూడదు. ట్విట్టర్‌లో అతిగా ఆలోచించడం కంటే ఇండియాకు మరో గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించడంలో కృషి చేస్తే బాగుంటుంది’ అంటూ రీకౌంటర్ ఇచ్చారు. మరి ఈ చర్చ ఇక్కడితో ఫుల్‌స్టాప్ పడుతుందో లేదో చూడాలి.
Taking pride in one’s own identity doesn’t allay their patriotism. Respecting one’s origin doesn’t convey separatism. Let’s not confuse both. Rather than overthinking on Twitter, maybe you should work towards getting India another #GoldenGlobe @AdnanSamiLive https://t.co/YZuY1JrZCf
— Rajini Vidadala (@VidadalaRajini) January 11, 2023
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..