Andhra Pradesh: కోడి పుంజుల కొట్లాటను తలదన్నేలా సోషల్ మీడియాలో టీడీపీ- వైసీపీ ఫైట్.. వీడియోలు మామూలుగా లేవుగా..
అడ్డా ఏదైనా.. పొలిటికల్ యుద్ధంలో తగ్గేదేలే అంటున్నాయి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన పార్టీలు. అధికారం కోసం నువ్వా నేనా సై అంటూ దుమ్మురేపుతున్నాయి.

అడ్డా ఏదైనా.. పొలిటికల్ యుద్ధంలో తగ్గేదేలే అంటున్నాయి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన పార్టీలు. అధికారం కోసం నువ్వా నేనా సై అంటూ దుమ్మురేపుతున్నాయి. రాజకీయంగా ప్రత్యక్ష రణ క్షేత్రంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతుంటే.. సెకన్ల వ్యవధిలో ప్రపంచాన్ని చుట్టేసే సోషల్ మీడియా వేదికగా వీడియోల యుద్ధం చేస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియా వేదికగా టీడీపీ-వైసీపీ మధ్య పోరు పీక్స్‌క్ చేరింది. ఒకరిపై ఒకరు సెటైర్లు, విమర్శలు చేసుకుంటూ కామెంట్స్, ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు రెండు పార్టీలకు చెందిన నేతలు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలు ఏపీ రాజకీయాలను మరింత రక్తి కట్టిస్తున్నాయి.
తాజాగా ట్విట్టర్‌లో అధికార వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ సోషల్ మీడియా వింగ్ ఓ వీడియో షేర్ చేసింది. అందులో ‘సైకోపోవాలి.. సైకిల్ రావాలి.. ఇదే ప్రజా తీర్పు కావాలి.’ అంటూ పాటను క్రియేట్ చేసి వీడియోను పోస్ట్ చేసింది టీడీపీ. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండగా.. వెంటనే రియాక్ట్ అయ్యింది అధికార వైసీపీ. తమ పార్టీకి చెందిన వీడియోను కాపీ కొట్టి ‘కాపీ క్యాట్స్’ అంటూ సెటైర్లు వేసింది. ‘చీప్, ఫేక్, కాపీ క్యాట్స్’ అని విమర్శిస్తూ ఒరిజినల్ వీడియోను షేర్ చేసింది వైసీపీ. ‘బైబై బాబు.. బైబై బాబు.. బైబై పప్పు.. ఇదే ప్రజా తీర్పు కావాలి’ అంటూ పాటతో ఉన్న వీడియోను షేర్ చేసింది వైసీపీ.




ఇలా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ లు సోషల్ మీడియా వేదికగా యుద్ధం సాగిస్తున్నాయి. జనాలను అట్రాక్ట్ చేయడంలో సోషల్ మీడియా కీలక పాత్ర అనే సంగతి తెలిసిందే. మరి ఇంత తెలిసిన రాజకీయ పార్టీలు కొంచెమైనా సందు దొరకనిస్తాయా? ఛాన్సే లేదు. మొత్తానికి ఈ రెండు పార్టీలు తమ తమ స్టైల్లో వీడియోలు ఎడిట్ చేసి పొలిటికల్ వార్ చేస్తున్నాయి. మరి జనాలు వీటిని ఎలా రిసీవ్ చేసుకుంటారు? వారి రియాక్షన్స్ ఏంటి అనేది ఎన్నికల ఫలితాలు చెబుతాయి.
టీడీపీ షేర్ చేసిన వీడియో..
ఇప్పుడు లేటెస్ట్ హిట్ పాట ఇదే…#PsychoPovaliCycleRavali #JaganPaniAyipoyindhi #JaganFailedCM pic.twitter.com/2Zglzdjk1D
— Telugu Desam Party (@JaiTDP) January 11, 2023
వైసీపీ షేర్ చేసిన వీడియో..
CHEAP, FAKE and COPYCATS !
These words sum up #TDP and its Agenda.
The Public gave their clear mandate in 2019 with #ByeByeBabu and in the upcoming 2024 elections it will be #GoodByeBabu ? for #PsychoCBN https://t.co/TcV7rZ6Dry pic.twitter.com/PDPFQ04fa1
— YSR Congress Party (@YSRCParty) January 11, 2023
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
