- Telugu News Photo Gallery Spiritual photos Sankranti 2023: Adivasi People Enjoying Traditional sankranti festival celebrations in paderu alluri district
Sankranti 2023: గిరిజన గూడెల్లో ముందస్తు సంక్రాంతి సందడి..! ఏజెన్సీ గ్రామాల్లో అడవి బిడ్డలు సంబరాల విశిష్టత ఏమిటో తెలుసా
ప్రతి ఏటా ఎన్నో తేదీలు మరెన్నో రోజులు.. అయినా బుధవారం సంక్రాతి పండగ జరుపుకునే సంప్రదాయం మాత్రం మారదు. బుధవారం సంక్రాంతి నాడు పండించిన తొలిచూరి బియ్యంతో పులగం తయారు చేస్తారు. తమకు వ్యవసాయ జీవనాధారమైన పాడి పశువులకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు.sankrant
Updated on: Jan 12, 2023 | 12:06 PM

అల్లూరి ఏజెన్సీలో ముందస్తు సంక్రాంతి జరుపుకుంటున్నరు గిరిజనులు. ఏజెన్సీ వ్యాప్తంగా సందడి వాతావరణం మొదలైంది. గిరిజనులంతా పండుగ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. పాడేరు మండలం వనుగుపల్లి పంచాయితీ లో సంక్రాంతి సందడిగా సాగుతోంది. గిరిజనులు సంక్రాంతికి ముందు వచ్చే మంగళవారం నుంచి పండగ చేసుకోవడం అనావయితి.

క్యాలెండర్ తో సంబంధం లేకుండా సాధారణంగా అందరూ జరుపుకునే సంక్రాంతికి ముందు మంగళవారం గ్రామ దేవతకు గంగాలమ్మకు పూజలు చేస్తారు ఇక్కడ గిరిజనులు. అదే రోజు రాత్రి భోగి మంటలు వేసి భోగి పండగ జరుపుకుంటారు.

బుధవారం సంక్రాంతి పండగ ..! ప్రతి ఏటా ఎన్నో తేదీలు మరెన్నో రోజులు.. అయినా బుధవారం సంక్రాతి పండగ జరుపుకునే సంప్రదాయం మాత్రం మారదు. బుధవారం సంక్రాంతి నాడు పండించిన తొలిచూరి బియ్యంతో పులగం తయారు చేస్తారు. తమకు వ్యవసాయ జీవనాధారమైన పాడి పశువులకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. కొత్త వస్త్రం... కొత్త కన్నె.. తాడు.. పూజలు నిర్వహిస్తారు. ఏడాది పండించిన కొత్త ధాన్యాన్ని పులగం ఆహారంగా తయారుచేసి పశువులకు తినిపిస్తారు. పశువుల మెడలో దుంపల్ని కడతారు. అంతా సందడిగా సంబరాలు చేసుకుంటారు.

మరుసటి రోజు గురువారం కనుమ పండుగ చేసుకుంటారు ఇక్కడే ఆదివాసీలు. పూర్వం నుండి వస్తున్న ఆచారాన్ని, సాంప్రదాయాలను గిరిజనులు ఇప్పటికీ పాటిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గిరిజన మహిళలు ప్రత్యేక వస్తదారణతో ఆకట్టుకుంటారు. దింసా నృత్యం చేస్తూ ఆడి పాడతారు.

అల్లూరి ఏజెన్సీలో జి మాడుగులలో తారు మారు సంత కు ప్రత్యేకత ఉంది. ప్రతి ఏటా సంక్రాంతికి ముందు వచ్చే మంగళవారం జి మాడుగుల లో తారుమారు సంత నిర్వహించడం ఆనవాయితీ. గిరిజనులు పండించిన పంటలను సంతకు తీసుకువచ్చి అమ్మకాలు జరిపి... పండక్కి కావలసిన సామాగ్రి కొనుగోలు చేస్తారు.

ఈ సందర్భంగా వేరువేరు ప్రాంతాలకు చెందిన గిరిజనలు అంతా ఒక చోట చేరి అంతా సరదాగా గడుపుతారు. పండక్కి రావాలని బంధువులకు ఆహ్వానిస్తారు. పూర్వం ఇక్కడ వస్తు మార్పిడి విధానం ఉండేది. రాను రాను పరిస్థితి మారిపోయింది. తారుమారు సంతని మత్స్యరాస కుటుంబీకులు సాంప్రదాయంగా నిర్వహిస్తారు.
