Sankranti: నారావారి పల్లెలో సంక్రాంతి సందడి.. గ్రామస్థులతో కలిసి వేడుకలను జరుపుకోనున్న నారా, నందమూరి ఫ్యామిలీలు
మూడేళ్ల తర్వాత కుటుంబ సమేతంగా సొంతూరికి వెళ్తున్నారు చంద్రబాబు. అక్కడ జనవరి 15 వరకు సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు. అంతేకాదు.. నారావారి ఫ్యామిలీతో కలిసి నందమూరి ఫ్యామిలీ కూడా వెళ్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. పల్లెలు సంస్కృతి, సంప్రదాయాలతో సప్తవర్ణాలను అడ్డుకున్నాయి. పట్టణ వాసులు పల్లెబాట పట్టారు. తమ సొంత ఊరులో తమ కుటుంబ సభ్యుల మధ్య సంక్రాంతి పండగను జరుపుకోవడానికి పయనమయ్యారు. మరోవైపు ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సొంతూరు నారావారి పల్లెలో సంక్రాంతి సందడి నెలకొంది. మూడేళ్ల తర్వాత కుటుంబ సమేతంగా సొంతూరికి వెళ్తున్నారు చంద్రబాబు. అక్కడ జనవరి 15 వరకు సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు. అంతేకాదు.. నారావారి ఫ్యామిలీతో కలిసి నందమూరి ఫ్యామిలీ కూడా వెళ్తోంది. ఇరు కుటుంబ సభ్యులు మూడు రోజులపాటు సంక్రాంతి సంబరాలను జరుపుకోనున్నారు.
ఈ సందర్భంగా నారా, నందమూరి అభిమానులు, టీడీపీ నేతలు, గ్రామస్తులంతా కలిసి స్వాగత ఏర్పాట్లను చేశారు. తెలుగుదనం ఉట్టిపడేలా.. సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా గ్రామాన్ని అలంకరించారు. చంద్రబాబు తల్లిదండ్రుల సమాధులు, నారావారి కులదైవం నాగాలమ్మ కట్టను సైతం ముస్తాబు చేశారు. జనవరి 12 సాయంత్రం నారావారి పల్లెకు నారా-నందమూరి కుటుంబాలు చేరుకుంటాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
