Botsa Satyanarayana: ఏపీలో మరో ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు విఫలం.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్న జేఏసీ..

ఆంధ్రప్రదేశ్ లో అటు రాజకీయ వేడి రాజుకుంటున్న వేళ పలు ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ అంగన్వాడీ కార్యకర్తలు నిరసన గళం వినిపించారు. ఆ తరువాత మున్సిపల్ కార్మికులు కూడా సమ్మె బాట పట్టారు. తాజాగా సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు కూడా సమ్మె సైరన్ మోగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల జేఏసీతో శనివారం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చర్చలు జరిపారు.

Botsa Satyanarayana: ఏపీలో మరో ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు విఫలం.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్న జేఏసీ..
Botsa Satyanarayana
Follow us

|

Updated on: Dec 30, 2023 | 11:29 PM

ఆంధ్రప్రదేశ్ లో అటు రాజకీయ వేడి రాజుకుంటున్న వేళ పలు ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ అంగన్వాడీ కార్యకర్తలు నిరసన గళం వినిపించారు. ఆ తరువాత మున్సిపల్ కార్మికులు కూడా సమ్మె బాట పట్టారు. తాజాగా సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు కూడా సమ్మె సైరన్ మోగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల జేఏసీతో శనివారం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చర్చలు జరిపారు. ఉద్యోగులు కోరుకున్న రీతిలో ప్రభుత్వం స్పందించలేదు. దీంతో మంత్రి బొత్స సత్యనారాయణతో చర్చలు విఫలమయ్యాయి. సమగ్ర శిక్షా అభియాన్‌ సిబ్బందిని రెగ్యులర్‌ చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు మంత్రి.

చర్చలనంతరం జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ.. “ఇప్పటి వరకు వేతనాలు పెరగని వారికి మాత్రమే పెంచుతామన్నారు. దానిపై కూడా నిర్దిష్టమైన హామీ రాలేదన్నారు. ఆదివారం నిరసన శిబిరం వద్ద చర్చలో జరిగిన అన్ని విషయాలను ఉద్యోగులతో వివరిస్తామన్నారు జేఏసీ నాయకులు. అ తరువాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం” అన్నారు జేఏసీ ప్రతినిధులు.

సమగ్ర శిక్షా అభియాన్ జేఏసీ సంఘాలతో చర్చల అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జేఏసీ ప్రతినిధులతో చర్చించాం.. సమ్మెలో కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఎన్నికల ముందు అడిగితే అన్నీ అయిపోతాయనే ఆలోచనలో ఉన్నారు. సమ్మె చేసే వారి వెనుక కమ్యూనిస్టు పార్టీ నేతలు ఉంటున్నారు’’ అని వ్యాఖ్యానించారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత, గ్రాట్యుటీ తదితర డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ సమ్మె కొనసాగిస్తున్నారు సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త
గర్భిణిని కత్తితో పొడిచిన సీరియల్‌ నటుడు.! గర్భ విచ్ఛిత్తి
గర్భిణిని కత్తితో పొడిచిన సీరియల్‌ నటుడు.! గర్భ విచ్ఛిత్తి