AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాలుగోవిడత పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్త వాతవరణం, పోలింగ్‌ బూత్‌ల దగ్గర ఇరు వర్గాల ఘర్షణలు, పోలీసుల జోక్యం

ఈ ఉదయం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ నాల్గొవ విడత పంచాయతీ ఎన్నికల్లో పలు చోట్ల ఉద్రిక్త వాతవరణం నెలకొంది. పోలింగ్‌ బూత్‌ల..

నాలుగోవిడత పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్త వాతవరణం, పోలింగ్‌ బూత్‌ల దగ్గర ఇరు వర్గాల ఘర్షణలు, పోలీసుల జోక్యం
Venkata Narayana
|

Updated on: Feb 21, 2021 | 12:30 PM

Share

ఈ ఉదయం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ నాల్గొవ విడత పంచాయతీ ఎన్నికల్లో పలు చోట్ల ఉద్రిక్త వాతవరణం నెలకొంది. పోలింగ్‌ బూత్‌ల దగ్గర ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ఫణిదం పోలింగ్ దగ్గర వైసీపీ – టీడీపీ నేతల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలింగ్‌ ఏజెంట్ల దగ్గర మొదలైన గొడవ పెరిగి పెద్దయింది. మాటమాట పెరగడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. గుంపులు గుంపులుగా ఉన్న కార్యకర్తలను బూత్‌ దగ్గర నుంచి పంపించివేశారు.

నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం వడ్డిపాళెం పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ వర్గం నేతలపై మరో వర్గం దాడి చేయడంతో టెన్షన్ చోటు చేసుకుంది. ఏజెంట్ల సమక్షంలోనే ఒకరి వేటు మరొకరు వేయడంతో ఘర్షణ చెలరేగింది. తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఓవర్గం నేతలు ధర్నాకు దిగారు.

కర్నూలు జిల్లా ఆలూరు మెయిన్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద టెన్షన్‌ చెలరేగింది.YSRCP. TDP మద్దతు సర్పంచ్ అభ్యర్థుల మధ్య ఓటర్లను పోలింగ్ కేంద్రం లోనికి పంపే విషయంలో ఘర్షణ చోటుచేసుకుంది. గొడవ పెరగడంతో ఇరువర్గాలను పోలింగ్‌ కేంద్రం నుంచి పోలీసులు పంపించివేశారు.

ఇటు గుంటూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో పలు చోట్లు రెండు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. పోలింగ్‌ బూతుల్లోనే ఏజెంట్ల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో ఉద్రికత్త చోటు చేసుకుంది. కుర్చీలతో ఏజెంట్లు కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి.

తిరుపతి పరిధిలోని కందులవారి పల్లి పంచాయతీ పోలింగ్ బూత్ దగ్గర టెన్షన్ చోటుచేసుకుంది. క్యూలైన్ల దగ్గర టీడీపీ నేతల ప్రచారాన్ని వైసీపీ మద్దతుదారులు తప్పుపట్టారు. క్యూ లైన్‌ దగ్గర గొడవ జరగడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించివేశారు.

ఇటు తిరుపతి రూరల్ మండలం సాయినగర్ పంచాయతీ పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంఇ. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ ఇద్దరు అభ్యర్థులు గొడవకు దిగారు. మాటమాట అనుకోవడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించివేశారు.

ప్రకాశం జిల్లాయర్రగొండపాలెం మేజర్ గ్రామపంచాయితీలో ఘర్షణ చోటుచేసుకుంది. అధికార ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీంగ్‌ బూత్‌లో ఇరువర్గాల నేతలు ప్రచారం చేయడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించి ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులతో కొందరు నేతలు వాగ్వివాదానికి దిగారు. పోలింగ్‌ బూత్‌ బయట కూడా ఇరువర్గాల నేతలు తిట్టుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు.

గుంటూర జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడులో టెన్షన్‌ చోటుచేసుకుంది. ఎస్సీ కాలనీలో పోలింగ్ బూత్ దగ్గర టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదానికి దిగారు. పోలింగ్ బూత్ పరిసరాల్లోకి ప్రవేశించటం పై పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఘర్షణ చెలరేగడంతో ఇరువర్గాలను తరిమికొట్టారు.

ఏపీలో పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. నాల్గో విడతలో మందకొడిగా కొనసాగుతోంది. . మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. నాలుగు గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభమవుతుంది.

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో నాల్గో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. తన నియోజకవర్గంలో పోలింగ్‌ సరళిపై ఎమ్మెల్యే అబ్బాయ్‌ చౌదరి టీవీ9తో మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు.

Read also :

తమిళనాట జోరుగా జల్లికట్టు పోటీలు, రక్తమోడుతున్నా వెనక్కి తగ్గని వైనం, చెట్టిపాలయంలో ప్రారంభించిన మంత్రి వేలుమణి

ఆమె నుదిటి బొట్టు టాక్ ఆఫ్ ద వరల్డ్, భారత సంతతి నాసా సైంటిస్ట్ స్వాతి మోహన్ చూపు.. శైలి అన్నీ సూపర్ అట్రాక్షన్